సోంపు గింజలు మన ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలుసా?

సోపు గింజలు ఆసియాలో ఒక స్థానిక మూలికగా ఉంది.ప్రత్యేక వాసన కలిగిన సోంపు గింజలను వంటల్లో ఉపయోగిస్తారు.

 Health Benefits Of Fennel Seeds-TeluguStop.com

ఇవి జీలకర్రను పోలి ఉంటాయి.సోంపు గింజలను ఎక్కువగా భారతీయ,జర్మన్, రష్యన్ వంటకాల్లో ఉపయోగిస్తారు.

దీనిలో విటమిన్స్,ఇనుము, కాల్షియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.ఇప్పుడు చర్మ,జుట్టు ఆరోగ్యానికి సోంపు గింజలు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.

1.కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది సోంపు గింజలు కడుపులో ఉండే క్రిములను చంపటానికి సహాయపడతాయి.సోంపు గింజల వినియోగంతో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా క్రిములను చంపటంలో సహాయపడతాయి.

2.జీర్ణాశయ సమస్యలు

సోంపు గింజలు కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ తగ్గించటంలో సహాయపడతాయి.అంతేకాక ఇతర ప్రేగు సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి.ఇవి చౌకగా ఉండి అందరికి అందుబాటులో ఉంటాయి.

3.దగ్గు

సోంపు గింజల్లో ఉండే లక్షణాలు దగ్గును తగ్గించటంలో సహాయపడతాయి.మిరియాలు,సోంపు గింజలు కలిపి తీసుకుంటే పొడి దగ్గు ఉపశమనంలో బాగా సహాయపడుతుంది.

4.గుండె ఆరోగ్యం

ఈ గింజల్లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన గుండె రేటును నిర్వహించటంలో సహాయపడుతుంది.

అంతేకాక ధమనులు మరియు సిరల సంకోచం మరియు వ్యాకోచాలకు సహాయపడి రక్తపోటును తగ్గిస్తుంది.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుంది.

5.యాంటిస్పాస్మాడిక్

సోంపు గింజల నూనెను ఒక యాంటిస్పాస్మాడిక్ గా భావిస్తారు.

ఎందుకంటే కండరాల సంకోచం ఉపశమనానికి కొన్ని ఎంజైములను నిరోధించటం ద్వారా కండరముల కుదింపులు మరియు తిమ్మిరిని సమర్ధవంతంగా నయం చేస్తుంది.అలాగే ఎక్కిళ్ళు మరియు శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube