మ‌హిళ‌లు త‌ర‌చూ కంద తింటే ఏం అవుతుందో తెలుసా?

మార్కెట్‌లో విరి విరిగా ల‌భించే దుంప‌ల్లో కంద గ‌డ్డ ఒక‌టి.చూపులకు అందంగా కనిపించకపోయినా.

కంద రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.అలాగే పొటాషియం, మాంగనీస్, కాల్షియం, సోడియం, విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా కంద గ‌డ్డ‌లో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్యానికి కంద ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా స్త్రీలు కంద‌ను తీసుకుంటే అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

సాధార‌ణంగా స్త్రీలో వ‌య‌సు పెరిగే కొద్ది ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లెవల్ త‌గ్గిపోతూ ఉంటుంది.దాంతో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుని.

Advertisement
Health Benefits Of Elephant Yam For Women-మ‌హిళ‌లు త‌ర‌

మోనోపాజ్ ద‌శ‌కు చేరువ‌వుతూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే తరచుగా చెమటలు పట్టడం, చికాకు ఆందోళన, కోపం, ఒత్తిడి, చికాకు, నీర‌సం వంటి సమ‌స్య‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో కంద గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అవును, స్త్రీలు వారంలో ఒక‌టి, రెండు సార్లు కందను తీసుకుంటే గ‌నుక‌.

అందులో ఉండే సపోనిన్ అనే కంటెంట్ మోనోపాజ్ ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించి ఈస్ట్రోజన్ ఉత్ప‌త్తిని పెంచుతాయి.అలాగే స్త్రీలో చాలా మంది అధిక బ‌రువుతో బాధ ప‌డుతూ ఉంటారు.

అలాంటి వారు కందను తీసుకుంటే.అతి ఆక‌లి త‌గ్గుతుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

మ‌రియు కంద‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌.త్వ‌ర‌గా వెయిట్ లాస్ అవుతారు.

Health Benefits Of Elephant Yam For Women
Advertisement

హెయిర్ ఫాల్ తో ఇబ్బంది ప‌డే స్త్రీలు.కంద‌ను డైట్‌లో చేర్చుకుంటే అందులో ఉండే ప‌లు పోష‌కాలు జుట్టుకు మంచి పోష‌ణ అందిస్తాయి.దాంతో జుట్టు రాల‌డం త‌గ్గి.

ఒత్తుగా పెరుగుతుంది.అంతేకాదు, స్త్రీలు కంద‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటుంది.ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.

శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

తాజా వార్తలు