మొలకలు ఆరోగ్యానికి చేసే మేలు తెలుసా?  

  • మొలకలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మొలకల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.

  • పెసలు

  • ఈ మొలకల్లో విటమిన్ సి,కె సమృద్ధిగా లభిస్తుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయపడతాయి. పెసర పొట్టులో ఉండే పాలెట్ గర్భిణీ స్త్రీలకు మరియు గర్భస్థ శిశువు ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఈ మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవటం మంచిది. పెసర మొలకలను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది. అందువల్ల సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిని తినటం వలన రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ దరి చేరవు.

  • బఠాణి

  • వీటిలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండుట వలన వ్యాయామం చేయటానికి ముందు తీసుకుంటే అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది. ఈ మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే తొందరగా ఆకలి వేయదు. అలాగే కడుపు నిండిన భావన ఉంటుంది. వీటిలో కొవ్వు,కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గే వారికీ మంచి ఆహారం.

  • సెనగలు

  • ఈ మొలకల్లో పిండి పదార్ధాలు,విటమిన్ b6 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కూడా బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహారం. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కొలస్ట్రాల్ కూడా ఉండదు. కాబట్టి బరువు ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మొలకలను తీసుకోవచ్చు.