నువ్వులు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నువ్వులతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తుంటారు.
నువ్వులతో నూనె తయారు చేసి కూడా వాడుతుంటారు.అయితే నువ్వులను ఎలా తీసుకున్నా.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాల్షియం, థయామిన్, విటమిన్ సి, విటమిన్ బి, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నువ్వుల్లో సమృద్ధిగా ఉంటాయి.
అందుకే నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
అయితే నువ్వులకు తేనెను చేర్చి తీసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి తేనె, నువ్వులు కలిపి ఎలా తీసుకోవాలి? అలా తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటీ? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని మిక్స్ చేసుకుని ఉదయాన్నే తీసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.నీరసం, దూరమై చురుగ్గా మరియు ఉత్సాహరంగా మారతారు.అలాగే నువ్వులు, తేనె కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి లభిస్తుంది.దాంతో అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అతిగా ఆకలి తగ్గుతుంది.దాంతో తినడం తగ్గిస్తారు.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతాయి.అంతేకాదు, తేనె మరియు నువ్వులు కలిపి ఉదయాన్నే తీసుకుంటే.
రక్త హీనత పరార్ అవుతుంది.బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.
ఎముకలు దృఢంగా తయారవుతాయి.శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.మరియు జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.