వర్షాకాలంలో గుమ్మ‌డికాయ తింటే..ఏం అవుతుందో తెలుసా?

Health Benefits Of Eating Pumpkin Rainy Season Pumpkin Benefits

వ‌ర్షాకాలం మొద‌లైంది.సాధార‌ణంగా మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే.

 Health Benefits Of Eating Pumpkin Rainy Season Pumpkin Benefits-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో విష జ్వ‌రాలు, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు, అంటు వ్యాధులు అధికంగా ఉంటాయి.వీటిని అధిగ‌మించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలీ అంటే.

ఖ‌చ్చితంగా అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే వ‌ర్షాకాలంలో ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

 Health Benefits Of Eating Pumpkin Rainy Season Pumpkin Benefits-వర్షాకాలంలో గుమ్మ‌డికాయ తింటే..ఏం అవుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి వాటిలో గుమ్మ‌డి కాయ ఒక‌టి.ఈ సీజ‌న్‌లో గుమ్మ‌డి కాయ‌ను తీసుకుంటే బోలెడ‌న్ని బెనిఫిట్స్ పొందొచ్చు.

అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.

సాధార‌ణంగా గుమ్మ‌డికాయ‌లో విట‌మిన్ ఎ, విట‌మిస్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫోలేట్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.అందుకే గుమ్మ‌డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా వ‌ర్షాకాలంలో గుమ్మ‌డిని డైట్‌లో చేర్చుకుంటే.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లప‌డుతుంది.దాంతో జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

అలాగే వ‌ర్షాల్లో త‌డ‌వటం వ‌ల్ల ఈ సీజ‌న్‌లో హెయిర్ ఫాల్ స‌మ‌స్య అధికంగా ఉంటుంది.అయితే గుమ్మ‌డి కాయ‌ను తీసుకుంటే.

అందులో ఉండే పోష‌క విలువ‌లు హెయిర్ ఫాల్‌ స‌మ‌స్య‌కు అడ్డు క‌ట్ట వేస్తాయి.అదే స‌మ‌యంలో జుట్టు ఒత్తుగా, వేగంగా పెరిగేందుకు స‌హాయప‌డుతుంది.

ఈ సీజ‌న్‌లో జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ వేధిస్తూనే ఉంటాయి.అయితే గుమ్మ‌డి కాయ‌ను వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు తీసుకుంటే.ఈ సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఇక గుమ్మ‌డిలో కేల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.అందు వ‌ల్ల‌, దీనిని డైట్‌లో చేర్చుకుంటే.వెయిట్ లాస్ అవ్వొచ్చు.

అంతేకాదు, గుమ్మ‌డికాయ‌ను తీసుకుంటే.కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

నిద్ర లేమి దూరం అవుతుంది.మ‌రియు ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

#Pumpkin #Pumpkin #Tips #Rainy Season

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube