నేరేడు పండ్లను తినటం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

నిగనిగలాడుతూ.నోరూరించే నేరేడు పండ్లు మనకు మార్కెట్ లో విరివిరిగా లభ్యం అవుతున్నాయి.వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.వీటిని తినటం వలన మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అంది అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.ఇప్పుడు నేరేడు పండ్లను తినటం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

 Health Benefits Of Eating Jamun Fruits-TeluguStop.com

నేరేడు పండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు లభిస్తాయి.

నేరేడు పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన నేరేడు పండ్లను తినటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నేరేడు పండ్లను నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం నోటిలో ఉండే బ్యాక్టీరియాను దూరం చేస్తుంది.దాంతో చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.దుర్వాసన రావడం వంటి సమస్యలు అన్ని దూరం అయ్యిపోతాయి.

నేరేడు పండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.అంతేకాక మధుమేహం ఉన్నవారు తింటే చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

నేరేడులో ఐర‌న్‌ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనతతో బాధపడేవారికి మంచి దివ్య ఔషధమని చెప్పవచ్చు.వీటిని తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube