మున‌గ ఆకును ఉడ‌క‌బెట్టి అందులో పసుపు క‌లుపుకుని తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు  

మున‌గ ఆకులో విటమిన్‌ ఎ, సి, పొటాషియం,ఇనుము, బీటా కెరోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మునగ ఆకుతో పప్పు,పచ్చడి,పొడి చేసుకుంటారు. మునగ ఆకు పొడిని తయారుచేసుకొని నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పొడవునా ఉపయోగించవచ్చు. విటమిన్ సి తప్పించి అన్ని పోషకాలు అలానే ఉంటాయి.

ఇక పసుపు విషయానికి వస్తే ప్రతి రోజు వంటల్లో తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. పసుపు కారణంగా వంటకు రుచి రావటమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పసుపులో సహజసిద్ధమైన యాంటీ బ‌యోటిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న మునగ ఆకును ఉడికించి దానిలో పసుపు కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.


మునగ ఆకును ఉడికించి దానిలో పసుపు కలిపి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉండేలా చేస్తుంది.

గర్భిణీ స్త్రీలు తినటం వలన పిండం ఎదుగుదలకు సహాయపడే ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. పిండం ఎదుగుదల సక్రమంగా ఉండి ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తుంది.

గర్భిణీ స్త్రీలు ఈ మిశ్రమాన్ని లిమిట్ గా తీసుకోవాలి. లేకపోతే డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్ష‌న్ల బారి నుండి కాపాడుతుంది.

తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావటం వలన మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి.

రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరగటంతో సహాయపడుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.