ఒంట్లో వండ‌ర్స్ సృష్టించే వాక్కాయ.. త‌ర‌చూ తింటే లాభాలే లాభాలు!

వాక్కాయ‌.( Vakkaya ) పేరు విన‌డ‌మే కాదు మీ లైఫ్ లో ఎప్పుడోక‌ప్పుడు వాటి రుచి కూడా చూసే ఉంటారు.

వాక్కాయను దేశీయ క్రాన్ బెర్రీస్ అని పిలుస్తారు.అలాగే కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు త‌దిత‌ర పేర్లు వాక్కాయ‌కు ఉన్నాయి.

పులుపు వ‌గ‌రు రుచుల‌ను క‌ల‌గ‌లిసి ఉండే వాక్కాయ‌లు మ‌న తెలుగు రాష్ట్రాల్లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతుంటాయి.ముఖ్యంగా ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో వాక్కాయ చెట్లు పెరుగుతుంటాయి.

వాక్కాయ‌లో విటమిన్ ఎ, విట‌మిన్ సి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ గా ఉంటాయి.పోష‌కాల‌కు ప‌వ‌ర్ హౌస్ లాంటి వాక్కాయ ఒంట్లో వండ‌ర్స్ సృష్టిస్తుంది.

Advertisement

త‌ర‌చూ వాక్కాయ‌ల‌ను తింటే బోలెడు ఆరోగ్య లాభాల‌ను పొందుతారు.

వాక్కాయ‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని ( Immunity )పెంపొందించడానికి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్ప‌డుతుంది.ఫైబ‌ర్ కంటెంట్ కు వాక్కాయ గొప్ప మూలం.

అందువ‌ల్ల వాక్కాయ‌ను త‌ర‌చూ తింటే జీర్ణక్రియ మరియు గట్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.ప్రేగు కదలికలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

మలబద్ధకం స‌మ‌స్య ఉంటే దూరం అవుతుంది.అలాగే వాక్కాయ‌లో ఫ్లేవనాయిడ్లు మరియు ఫినాలిక్ సమ్మేళనాలతో సహా యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

శ‌రీరంలో కణాలను దెబ్బ తీసి, దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం ప‌డే ఫ్రీ రాడికల్స్‌తో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పోరాడుతాయి.

Advertisement

మధుమేహుల‌( Diabetes )కు కూడా వాక్కాయ‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి.వాక్కాయ‌లో విటమిన్ ఎ ఉంటుంది.

ఇది చ‌ర్మం యొక్క ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది.వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

అంతేకాదు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు ఇతర వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో వాక్కాయ‌లు చాలా అద్భుతంగా సహాయపడతాయి.కాబ‌ట్టి ఇక‌పై వాక్కాయ‌లు క‌నిపిస్తే పొర‌పాటున కూడా వ‌దిలి పెట్ట‌కండి.

తాజా వార్తలు