అవోకాడో విత్తనాలలో ఉన్న ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన ప్రయోజనాలు  

Health Benefits Of Eating Avocado Seeds -

అవోకాడోను చాలా మంది ఇష్టపడే సూపర్ ఆహారం అని చెప్పవచ్చు.పండిన అవోకాడోను శాండ్విచ్లు, స్మూతీస్, సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు.

అంతేకాక ఫేస్ పాక్స్ లలో కూడా ఉపయోగిస్తారు.అయితే అవోకడో విత్తనాన్ని దూరంగా పడేస్తూ ఉంటాం.

Health Benefits Of Eating Avocado Seeds-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

కానీ దానిలో యాంటిఆక్సిడెంట్, ఫైబర్ మరియు ఫినోలిక్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది.ఈ విత్తనాలు చేదు మరియు వగరు రుచిలో ఉంటాయి.

1.వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది
అవోకాడో విత్తనాలలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

నిజానికి పండులో కంటే విత్తనంలోనే 70 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.యాంటీఆక్సిడాంట్లు ఫ్రీ రాడికల్స్ ని దూరం చేసి,రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి బాక్టీరియా, వైరల్ అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది.

2.హై కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
అవోకాడో గుజ్జులో అసంతృప్త కొవ్వులు సమృద్దిగా ఉండుట వలన అధిక స్థాయిలో ఉన్న లైపోప్రోటీన్ (LDL లేదా చెడు కొలెస్ట్రాల్) తగ్గించేందుకు సహాయం మరియు హై-డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL లేదా మంచి కొలెస్ట్రాల్) పెంచుకోవటానికి సహాయపడుతుంది.

ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.అంతేకాక కరిగే ఫైబర్ ఉండుట వలన గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

3.క్యాన్సర్ మీద పోరాటం
అవోకాడో విత్తనాలలో క్యాన్సర్ మీద పోరాటం చేసే లక్షణాలు ఉన్నాయి.

దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కణితి పెరుగుదలను తగ్గించటానికి సహాయపడతాయి.అంతేకాక అవోకాడో విత్తనాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు లుకేమియా మూలకణాల నుండి ఆరోగ్యమైన కణాలను రక్షిస్తాయి.అలాగే అవోకాడో పండులో ఉండే అవోకాతిన్ బి అనేది లుకేమియా కణాల సంఖ్యను తగ్గించటంలో సహాయపడుతుంది.

4.బరువు కోల్పోవటానికి సహాయం
అవోకాడో విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కొవ్వును కరిగించి బరువు కోల్పోవటంలో సహాయం చేస్తాయి.అలాగే కరిగే ఫైబర్ కంటెంట్ కూడా ఆకలి భావనను తగ్గిస్తుంది.

అధిక క్యాలరీలు ఉన్న స్నాక్స్ తినకుండా నిరోదిస్తుంది.అంతేకాక కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు బరువు కోల్పోవటానికి మద్దతును ఇస్తాయి.

బరువు కోల్పోవటానికి సగం అవోకాడో విత్తనం, ఒక గ్రీన్ ఆపిల్,ఒక నిమ్మకాయ,సగం అరటిపండు, అరకప్పు పాలకూర,ఒక స్పూన్ అల్లం లను ఉపయోగించి ఒక స్మూతీ తయారుచేసుకోవాలి.

తాజా వార్తలు

Health Benefits Of Eating Avocado Seeds- Related....