చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి మునక్కాడలతో పరిష్కారం.  

మన చుట్టూ ఉండే కాయగూరల్లో, ఆకు కూరలులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.వాటిని మనం వండుకుని తినడం వలన.ఎన్నో మొండి వ్యాధులను నయం చేయవచ్చు. ముఖ్యంగా మునక్కాయలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి.మునక్కాయలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..

-

మునగాకుతో వంటలు వండుకుని తినడం వలన మనకి అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.లావుగా ఉండేవాళ్ళు మునగాకుతో చేసిన కూరల్ని తినడం వలన బరువు క్రమంగా తగ్గుతారు. ఇందులోని విటమిన్-సి ఎముకలను ఇంకా ధృఢంగా చేస్తుంది.

విటమిన్ ఎ-సినే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకు మధుమేహం రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది.జీర్ణశక్తిని పెంచుతుంది.దీనిలో ఉండే విటమిన్ ఏ ద్వారా కళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మునక్కాయలు రోజు ఆహారంలో ఉండేలా చూసుకుంటే పురుషులలో వీర్య వృద్ది పెరుగుతుంది. కండరాల బలహీనతలు ఉన్నవాళ్లు సైతం ఈ మునక్కాయలు తినడం వలన ఎంతో ఉపశమనం పొందుతారు.