ప్రతి రోజు పరగడుపున నిమ్మరసం త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు     2018-04-28   22:57:26  IST  Lakshmi P

నిమ్మరసంలో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తాయి. మనం ఎక్కువగా నిమ్మరసాన్ని వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తాం. అయితే నిమ్మరసాన్ని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున త్రాగితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే వృద్ధాప్య ఛాయలు రాకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు కూడా రావు.

-

నిమ్మరసంలో పాస్ఫరస్ సమృద్ధిగా ఉండుట వలన గుండెను ఆరోగ్యంగా ఉంచటమే కాకూండా గుండెకు సంబందించిన ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. నిమ్మకాయలో యాసిడ్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. నిమ్మరసం త్రాగగానే శరీరంలోకి వెళ్ళాక ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కాబట్టి ఎలాంటి వారైనా నిమ్మరసాన్ని త్రాగవచ్చు.

ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మరసం తరగటం వలన శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది. శరీరంలో విషాలు అన్ని బయటకు పోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా స్థిరీకరణ జరుగుతుంది. దాంతో మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో మన శరీరంలో బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.