ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదే..! ఎలా అంటే..?!  

Health benefits of Crying, Crying, Tears, Hormones, Stress, Eye Infections - Telugu Crying, Good Health, Health Benefits Of Crying, Hormones, Stress

పుట్టిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఈ భూమి మీదకు అడుగు పెడ్తారు.బాధలో ఉన్నప్పుడు సహజంగా కన్నీళ్లు వస్తాయి.

TeluguStop.com - Health Benefits Of Crying

ఒక్కోసారి మరింత సంతోషంగా ఉన్నప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి.దీనినే ఆనంద బాష్పాలు అని అంటుంటారు.

మనస్సులోని భావోద్వేగాలను అధిగమించలేనప్పుడు అది కన్నీళ్ల రూపంగా బయటకు వస్తుంది.అయితే ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అవును, మీరు విన్నది నిజమే.ఏడుపు వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయని, ఆరోగ్య సమస్యలు కూడా ఏడుపు వల్ల తొలగిపోతాయని చెప్తున్నారు.

TeluguStop.com - ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదే.. ఎలా అంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కన్నీళ్ల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఇంకా శాస్త్రీయంగా ఏడవడానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.మనస్సు నుండి అనేక భావోద్వేగాల వల్ల బయటకు వచ్చే కన్నీళ్ళ నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

ఈమధ్య చేసిన కొన్ని పరిశోధనల ప్రకారం, కన్నీళ్లలో ఉండే కొన్ని విషపూరిత అంశాలు ఏడుపు రూపంలో బయటకు వస్తాయి.ఇది శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఇది శరీరంలోని విష వాయువులను తొలగిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.సహజంగా శుభ్రపరచడం భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ లో ఉంటుందట.

ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన సహజ ప్రక్షాళనగా పనిచేస్తాయి.ఏడుపు ద్వారా మెదడులో ఉత్పత్తి అయ్యే ఎండార్ఫిన్లు రిలీజ్ అయ్యి, మంచి ఎమోషన్ హార్మోన్ల ఏడుపు మనస్సును చాలా తేలికపరుస్తుంది.

అలాగే మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఏడుపు వల్ల కలిగే మరో ముఖ్యమయిన ఆరోగ్య ప్రయోజనం ఏమిటి అంటే.

ఇది మన కళ్ళకి కావాల్సిన తేమను ఇస్తుంది.ఏడుపు వల్ల కళ్ళు పొడిబారటం, ఎరుపెక్కటం దురదలు వంటివి నివారించవచ్చు.

చూసారా కన్నీళ్లు వల్ల ఎన్ని లాభాలో.కాబట్టి కళ్లు మనకి అత్యంత విలువైన సంపద వాటిని నిర్లక్ష్యం చెయ్యదు, అందుకనే మన పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.

#Good Health #Stress #HealthBenefits #Hormones #Crying

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Health Benefits Of Crying Related Telugu News,Photos/Pics,Images..