ధనియాలు ఎన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందో తెలుసా?

ధనియాలు ప్రతి ఇంటి వంటగది పోపుల డబ్బాలో ఉండటం సహజమే.ధనియాలు అందరూ వాడతారు.

 What Are The Health Benefits Of Coriander Seeds, Health Benefits, Coriander Seed-TeluguStop.com

కానీ అందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.ధనియాలులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు.

కొత్తిమీర మొక్క నుండి వచ్చిన గింజలను ఎండబెడితే ధనియాలు తయారు అవుతాయి.ధనియాలు గింజల రూపంలోనూ మరియు పొడి రూపంలోనూ మార్కెట్ లో దొరుకుతుంది.

జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉన్నప్పుడు అరగ్లాసు ధనియాల కాషాయం త్రాగితే శరీరంలో వేడి తగ్గి మంచి ఉపశమనం కలుగుతుంది.

ప్రతి రోజు ధనియాల కషాయాన్ని త్రాగితే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.

ధనియాలులో ఉండే గుణాలు రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతాయి.

టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు ధనియాలలో సమృద్ధిగా ఉన్నాయి.

అందువల్ల టైఫాయిడ్ వచ్చినప్పుడు మందులతో పాటు ధనియాల కషాయాన్ని త్రాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

Telugu Cholestrol, Coriander, Coriander Seeds, Corianderseeds, Cough, Dark Spots

ధనియాల పొడిలో చిటికెడు పసుపు వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు మరియు మొటిమల మచ్చలు తొలగిపోతాయి.

ధనియాల కషాయాన్ని ప్రతి రోజు త్రాగుతూ ఉంటె శరీరంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube