2 వారాలు ఈ డ్రింక్ తీసుకుంటే చాలు..! హార్ట్ ఎటాక్ అస్సలు రాదు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో నేడు అధిక శాతం మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు.వీటికి ప్ర‌ధాన కార‌ణ‌మేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే.

 Health Benefits Of Coriander Juice1-TeluguStop.com

మ‌న శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అదంతా ర‌క్త నాళాల గోడ‌ల‌కు అతుక్కుని అక్క‌డే ఉండిపోతుంది.దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్ర‌మేపీ ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి, ఫ‌లితంగా గుండె పోటు వ‌స్తుంది.

దీంతోపాటు ప‌లు ఇత‌ర గుండె సంబంధ వ్యాధులు కూడా వ‌స్తాయి.అయితే నిత్యం వ్యాయామం చేయ‌డం, త‌గిన పౌష్టికాహారాన్ని వేళ త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం, ధూమ పానం, మ‌ద్య పానం మానివేయ‌డం, కొవ్వు ప‌దార్థాల‌ను త‌క్కువగా తిన‌డం వంటి సూచ‌న‌లు పాటిస్తే ఈ చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకుని ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

దీంతోపాటుగా కింద ఇచ్చిన ఓ మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని దాన్ని క‌నీసం 2 వారాల పాటు నిత్యం తాగినా శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంట‌నే క‌రిగిపోతుంది.దీని వ‌ల్ల గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు.

ఆ మిశ్రమాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర 3 క‌ట్ట‌లు, 1 కిలో నిమ్మకాయ‌లు, 5 లీట‌ర్ల నీళ్లు, కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకోవాలి.ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన నిమ్మ‌కాయ‌లైతే బెట‌ర్‌.లేదంటే సాధార‌ణ నిమ్మ‌కాయ‌ల‌కు క్రిమి సంహార‌క మందులు ప‌ట్టి ఉంటాయి.

కాబ‌ట్టి వీటిని తొల‌గించాలంటే నిమ్మ‌కాయ‌ల‌ను బేకింగ్ సోడా, నీరు మిశ్ర‌మంలో వేసి 5 నిమిషాల పాటు బాగా క‌డ‌గాల్సి ఉంటుంది.అనంత‌రం నీటిని తీసుకుని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి.

కొత్తిమీర‌, నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకుని వాటిని చిన్న చిన్న పీస్‌లుగా క‌ట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్ ప‌ట్టాలి.ఆ జ్యూస్‌ను మ‌ర‌గ‌బెట్టిన నీటికి క‌లిపి వ‌డ‌పోయాలి.

అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని బాటిల్‌లో పోసి నిల్వ చేసుకోవాలి.ఆ బాటిల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.24 గంట‌ల త‌రువాత నుంచి ఆ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది.నిత్యం 1 గ్లాస్ చొప్పున ఈ జ్యూస్‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి.

ఇలా క‌నీసం 2 వారాలు చేయాలి.మొద‌టి వారంలోనే మీరు ఆశ్చ‌ర్య‌క‌ర ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తారు.

పైన చెప్పిన మిశ్ర‌మాన్ని 2 వారాల పాటు తాగితే శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంట‌నే క‌రిగిపోతుంది.దీంతో గుండె ప‌దిలంగా ఉంటుంది.ర‌క్త నాళాలు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

ర‌క్తం శుద్ధి కూడా అవుతుంది.జ‌లుబు, జ్వ‌రం ఉన్న వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ర‌క్తంలో ఉన్న విష ప‌దార్థాలు అన్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.శ‌రీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల‌కు ర‌క్తం ద్వారా ఆక్సిజ‌న్ బాగా స‌ర‌ఫ‌రా అవుతుంది.

ఇప్ప‌టికే గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు, స‌మ‌స్య‌లు రావ‌ద్దనుకునే వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube