కర్పూరం మీరు స్నానం చేసే నీటిలో కరగబెట్టి స్నానము చేస్తే నమ్మలేని మార్పులు జరుగుతాయి     2017-12-12   23:01:50  IST  Lakshmi P

కర్పూరం తెల్లగా ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. కర్పూరం కాంఫర్ లారెల్ అనే చెట్టు నుండి లభ్యం అవుతుంది. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్ల నుంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరంను తయారుచేస్తారు. మనకు కర్పూరం అనగానే దేవుడికి ఇచ్చే కర్పూరమే గుర్తుకు వస్తుంది. కర్పూరంలో తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు బాగా ప్రసిద్ధి చెందాయి. కానీ కర్పూరంలో దాదాపుగా 15 రకాలు ఉన్నాయి. పచ్చ కర్పూరాన్ని ఎక్కువగా ఔషధంగా ఉపయోగిస్తారు. తెల్ల కర్పూరాన్ని పూజలలో వాడతారు.

స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న క్రిములన్నీ చనిపోతాయి.

ఇంటిలో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యం పోయి వాతావరణం స్వచ్ఛంగా ఉండి అంటువ్యాధులు రాకుండా ఉంటాయి.


రాత్రి పడుకునే ముందు కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డ లో చుట్టి మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది . అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి శరీర జీవ క్రియలు చక్కగా జరుగుతాయి.

ఒక కప్పు నీటిలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే కర్పూరం ఘాటైన వాసనకు దోమలు పోతాయి.

వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఇల్లు తుడిస్తే ఈగలు అటు వైపు కూడా రావు.

ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై చిటికెడు కర్పూరం పొడి వేసుకుని దంతాలను శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు కూడా చనిపోతాయి.

చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనె లో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది.

కళ్ళకు మేలు చేస్తుంది కాబట్టి కాటుక తయారీలో పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు.