తులసి ఆకులను ఇలా వాడితే.. ఎన్నో రకాల ఔషధ గుణాలు మీ సొంతం..?

మన దేశంలో చాలా మంది ప్రజలు తులసి( Holy Basil )ని ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు.తులసి మొక్కను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రధానమైన ఔషధ మూలికగా ఉపయోగిస్తున్నారు.

 Health Benefits Of Basil Leaves,basil Leaves,tulsi,tulsi Tea,immunity Boosting,t-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే తులసి శాస్త్రీయ నామం ఆసిమమ్ టెనుప్లోరమ్( Ocimum tenuiflorum ).ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క.తులసి భారత ఉపఖండానికి చెందినది.మన దేశంలో తులసి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన మొక్క అని పండితులు చెబుతున్నారు.


Telugu Basil, Benefits Basil, Tips, Immunity, Medicinal, Tulsi, Tulsi Tea, Tusi

ఆయుర్వేదంలో తులసి చాలా ఔషధ గుణాలు( Medicinal Properties ) కలిగి ఉంటుంది.తులసి అడాప్టోజెనిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటి ఇన్ఫ్లమేటరీ,ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలన్ని కలిగి ఉంటుంది.తులసిని వివిధ రకాల ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.తులసి మొక్క ఆకులను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.తాజా తులసి ఆకులు లేదా ఎండిన ఆకుల పొడిని వేడి నీటిలో వేసి టీ( Tulsi Tea ) తయారు చేసుకోవచ్చు.ఇది చాలా రిఫ్రెష్షింగ్ ఉండే టీ.


Telugu Basil, Benefits Basil, Tips, Immunity, Medicinal, Tulsi, Tulsi Tea, Tusi

ఒక కప్పు వేడినీటినీకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తులసి ఆకులు పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత టీ తాగాలి.తులసి టీ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.కొన్ని తాజా తులసి ఆకులు లేదా తులసి పొడి ఒక కుజా నీటిలో వేసి రాత్రంతా మూత పెట్టి అలాగే ఉంచాలి.

తెల్లవారి తరువాత రోజంతా ఆ నీటిని తాగడం వల్ల మన శరీరం డిటాక్స్ అవుతుంది.ప్రతి రోజు రెండు లేదా మూడు తులసి ఆకులు పరిగడుపున తినడం వల్ల రోగ నిరోధక శక్తి( Immunity Boosting ) పెరుగుతుంది.

అలాగే వంటకాల రుచి పెరగడం కోసం కూడా తులసి ఆకులను ఉపయోగించవచ్చు.మార్కెట్లో లభించే తులసి క్యాప్సిల్స్ ను వైద్యుల సలహా తీసుకొని మాత్రమే ఉపయోగించడం మంచిది.

ఎందుకంటే ఆ క్యాప్సిల్స్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వేరే ఔషధమూలికను కూడా కలిపి ఉండవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube