అరటిపండు తొక్క తింటే ఏమవుతుందో తెలుసా  

అరటిపండు తొక్క తినటం ఏమిటని ఆలోచిస్తున్నారా? అవును అరటిపండు తొక్క తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. అరటి పండు తింటే తక్షణ శక్తి రావటమే కాకుండా అందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అలాగే ఫైబర్ మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు అరటిపండు తొక్కతో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

-

డిప్రెషన్ తో బాధపడుతున్నవారు రెండు రోజులు అరటిపండు తొక్కను తినాలి. వాటిలో ఉండే లక్షణాలు శరీరంలో సెరటోనిన్ స్థాయిలను పెంచి డిప్రెషన్ ని తగ్గిస్తాయి. డిప్రెషన్ తగ్గితే మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

అరటిపండు తొక్కలో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఉండుట వలన అరటిపండు తొక్కను రెగ్యులర్ గా తింటే నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

అరటిపండులో కన్నా అరటిపండు తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అరటిపండు తొక్కను తింటే చెడు కొలస్ట్రాల్ తగ్గి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. దీనితో గుండెకు సంబందించిన సమస్యలు రావు.

అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.