ఉసిరి కాయ, మునగాకు ఈ రెండూ విడి విడిగా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అనేక జబ్బులనూ నివారిస్తాయి.అయితే ఈ రెండింటిని విడి విడిగానే కాదు కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందొచ్చు.
ముఖ్యంగా ఉసిరి కాయలను, మునగాకులను కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగితే.బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఉసిరి కాయ, మునగాకు లతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి.? ఆ జ్యూస్‌ను ఎప్పుడు తీసుకోవాలి.? అసలు ఆ జ్యూస్‌ను తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కప్పు మునగాకు తీసుకుని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి.ఇప్పుడు మిక్సీ జార్లో మునగాకు, గింజలు తీసిన ఉసిరి కాయలు రెండు వేసి వాటర్ సాయంతో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడకట్టాలి.ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్‌ను తీసుకుంటే గనుక.
అందులోని విటమిన్ సి మరియు ఇతర శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.ఫలితంగా అనేక వైరస్లు, ఇన్ఫెక్షన్లు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఉసిరి, మునగాకు కలిపి పైన చెప్పిన విధంగా జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి.తద్వారా క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.అలాగే ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల.అందులోని ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంపొందించి రక్త హీనతను నివారిస్తుంది.
అంతే కాదు.ఉసిరి, మునగాకు కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగితే ఎముకలు దృఢంగా మారతాయి.
థైరాయిడ్ గ్రంధి పని తీరు మెరుగ్గా మారుతుంది.రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
తల నొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మరియు వృద్ధాప్యం కారణంగా శరీరంపై వచ్చే ముడతలు సైతం పోయి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.