మధుమేహాన్ని కంట్రోల్ చేసే మెంతులు.. ఎలానో తెలుసా?

మెంతులు ప్రతి ఇంట్లో వాడే వంటింటి దినుసు.చూడడానికి దీని పరిమాణం చిన్నగా బంగారువర్ణంలో ఉంటుంది.

 Fenugreek Seeds To Control Diabetes, Health Benefits Of Fenugreek Seeds, Fenugre-TeluguStop.com

అయితే దీని రుచి చేదుగా ఉన్నా, మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.అందుకే మన పూర్వీకులు మెంతులను ఎక్కువగా వంటలలో ఉపయోగించే వారు.

అయితే ప్రస్తుతం వీటి వాడకం చాలా వరకు తగ్గిపోయింది.వీటిని ఊరగాయలు, పచ్చళ్లలో వేయడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

మెంతులను మన రోజు వారి జీవితంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

మెంతులలో విటమిన్లు, ఐరన్, బీటా కెరోటిన్, ప్రొటీన్లు వంటి ఎన్నోపోషక గుణాలు ఉన్నాయి.

మెంతులు రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి.టైప్ డయాబెటిస్ తో బాధపడేవారు మెంతులను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

పాలిచ్చే తల్లులు మెంతి టీ తాగడం వల్ల ఇందులో ఉన్న ఫైటో ఈజ్ ఈస్ట్రోజన్ అనే హార్మోను తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది.ఇది శిశువు యొక్క పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

రుతుస్రావ సమయంలో కొంతమంది మహిళలు తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు.అలాంటి వారు కొద్దిగా మెంతిపొడిని తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ తలనొప్పి, అలసట, వికారం వంటి సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది.

మెంతి గింజల లో, నరింగెనిన్ అనే ఫ్లేవనాయిడ్లు ఉండటం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారిలో లిపిడ్ సాయిని పూర్తిగా తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి కలిగిస్తుంది.

కొద్దిగా మెంతులను పెరుగులో ఒకరోజు రాత్రంతా నానబెట్టి, దానిని మెత్తగా మిశ్రమంగా తయారు చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మన జుట్టుకు అంటించుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గి, నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.

మెంతులలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించడంలో కూడా మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube