పాలలో వెల్లుల్లి ఉడికించి తింటే ఏమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

  • వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ లక్షణాలు ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. అయితే ఒక గ్లాస్ పాలలో దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను వేసి ఉడికించి త్రాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • -

  • పాలలో వెల్లుల్లిని వేసి ఉడికించటం వలన మన శరీరానికి అవసరమైన ఫ్లేవ‌నాయిడ్స్, ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌భిస్తాయి. విట‌మిన్ ఎ, బి1, బి2, బి6, సి విట‌మిన్‌, పొటాషియం, ప్రోటీన్లు, కాప‌ర్‌, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, జింక్‌, సెలీనియం, కాల్షియం అన్ని సమృద్ధిగా అందుతాయి. ఈ పోషకాలు అన్ని మన శరీరానికి అవసరమే. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయే వారికి ఇది దివత ఔషధం అని చెప్పవచ్చు. పాలలో ఉడికించిన వెలుల్లిని తింటే వేగంగా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. అలాగే ఇన్ ఫెక్షన్స్ కూడా రావు.

  • చెడు కొలస్ట్రాల్ తగ్గి మంచి కొలస్ట్రాల్ పెరగటం వలన గుండె జబ్బులు రావు. అంతేకాక గుండె పనితీరు బాగుంటుంది.

  • పాలలో ఉడికించిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

  • పాలలో ఉడికించిన వెల్లుల్లిలో యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు ఉండుట వలన వృద్దాప్య ఛాయలు తొందరగా రావు. దాంతో ముడతలు వంటి సమస్యలు కూడా రాకుండా చర్మం తాజాగా ఉంటుంది.