చ్యవన్‌ప్రాష్‌ తో కరోనా వైరస్ కు చెక్!

అపారమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందిన చ్యవన్‌ప్రాష్‌ ఒక శక్తివంతమైన మూలికా ఔషధం.భారతదేశంలోని వివిధ ఆహార పదార్ధాలలో ఈ పదార్ధాన్ని విస్తారంగా వాడుతున్నారు.

 Health Benefits Of Chyawanprash,chyawanprash, Covid-19, Coronavirus Infection, A-TeluguStop.com

పురాతన కాలం నుంచి ఈ సూత్రీకరణ ఆయుర్వేద వైద్యులు మొత్తం రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇంకా ఒక వ్యక్తి యొక్క దీర్ఘాయుషు ను పెంచడానికి ఉపయోగిస్తారు.అయితే ఈ చ్యవన్‌ప్రాష్‌ కరోనా నివారణ పదార్థాల లిస్ట్ లో చేరిపోయింది.

ఈ విషయాన్ని ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-19 మేనేజ్మెంట్ ప్రోటోకాల్ లో చేర్పించింది.అయితే కరోనా నివారణకు చ్యవన్‌ప్రాష్‌ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

శక్తివంతమైన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, అధిక మొత్తంలో ఖనిజాలు, విటమిన్ సి ఉండటం వల్ల వివిధ రకాల ఆరోగ్య పరిస్థితులు నివారణకు విస్తృతంగా సహాయపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఎంతో సహాయ పడుతుంది.

ఇక ఈ చ్యవన్‌ప్రాష్‌ ఊపిరితిత్తులు లేదా శ్వాసకోస సంబంధించిన వ్యాధులకు ఎంతో అద్భుతంగా పని చేస్తుంది.

ఈ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా నివారణకు మంచి ఔషధంగా చెప్పబడింది.

విటమిన్ సి తో పాటు ప్రొటీన్లు ఫైబర్ పొటాషియం, సోడియం, ఆల్కలాయిడ్లు అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లతో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి.ఇది గుండె రక్తనాళాలు పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలకు గొప్ప అనుబంధంగా మారుతుంది.

ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు.కేలరీలు కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి.

ఇది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.అంతేకాకుండా జీర్ణక్రియ రేటును మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.తరచూ ఈ చూర్ణాన్ని తీసుకోవడం ద్వారా వికారం వాంతి వంటి సమస్యలు తగ్గుతాయి.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చ్యవన్‌ప్రాష్‌ ప్రతి రోజు ఉదయం ఒక క్లాస్ గోరువెచ్చని నీటిలోకి లేదా పాలల్లోకి ఒక టీస్పూన్ కలుపుకుని తాగడం ద్వారా ఆరోగ్యంగా తయారవుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube