ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయంటే..!?

మన ఇంటి పెరట్లో ఎన్ని మొక్కలు ఉన్నాసరే తులసి మొక్క ఉంటే ఆ వాతావరణమే మారిపోతుంది.ఈ తులసి చెట్టును కేవలం చెట్టు గా మాత్రమే కాకుండా ఒక దైవంగా కూడా కొలుస్తారు హిందువులు.

 Health Benefits Of Drinking Basil Leaves Water Early Morning, Basil Leaves Water-TeluguStop.com

ఇదంతా పక్కన పెడితే.తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఔషధ గుణాలను మనం పొందవచ్చు.

తులసి ఆకులను ఏ విధంగా ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఓసారి చూద్దామా…

ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని బాగా దంచి వాటిని కషాయంగా కాచుకుని ఆపై కొద్దిగా అందులో తేనె కలుపుకుని తాగితే శరీరంలో ఏదైనా కఫం ఉంటె ఇట్టే తగ్గుతుంది.ఇక ఈ తులసి ఆకులు మన శరీరంలో ఉండే అధిక కొవ్వును కూడా నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇందుకోసం ప్రతిరోజూ తులసి ఆకులను కొద్దిగా మజ్జిగతో కలిపి తాగితే బరువు తగ్గడం లో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే ప్రతిరోజు ఉదయాన్నే తులసి ఆకులను నీళ్ళలో వేసి కొద్ది సేపు మరిగించాక ఆ నీటిని మన నోటితో పుక్కిలించి బయటికి వదిలేస్తే గొంతులో ఏదైనా క్రిమికీటకాలు ఉంటే నశింపజేస్తుంది.

ప్రతి రోజూ నాలుగు లేదా ఐదు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఒకవేళ తరచుగా జ్వరం వస్తుంది అనుకున్న వారికి పుదీనా ఆకులు, తులసి ఆకులు కలిపి కషాయంగా చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.

రాత్రి సమయంలో నిద్ర కు వెళ్లే ముందు కొన్ని తులసి ఆకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే లేచిన వెంటనే ఆ నీటితో బ్రష్ చేసుకోవడం ద్వారా నోటిలో ఉండే దుర్వాసన, అలాగే నోట్లో ఉండే ఏదైనా పుండ్లు లేదా పొక్కులు బాగా తగ్గుతాయి.ఇలా ప్రతిరోజు ఉదయాన్నే తులసి ఆకులను కొద్దిగా తీసుకుంటే శరీరంలో తరచుగా వచ్చే చిన్నచిన్న రోగాల నుండి దూరంగా ఉండవచ్చు.

కాబట్టి వీలైతే మీ ఇంటి పెరటిలో ఎన్ని చెట్లు ఉన్నా కానీ తులసి చెట్టును పెంచడం మర్చిపోవద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube