వెన్ను నొప్పిని వేగంగా తగ్గించే ఆహారాలు  

  • ఈ మధ్య కాలంలో వెన్ను నొప్పి అనేది అందరినీ వేదించే సమస్యలలో ఒకటిగా ఉంది. ఈ వెన్ను నొప్పి రావటానికి అధిక బరువు, సరైన జీవనశైలి లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే వెన్ను నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

  • ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో ఉండే పీచు గ్యాస్ట్ర్రిక్ , మలబద్దకం,వెన్ను నొప్పి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

  • పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కుర్కుమిన్ వాపును తగ్గించటమే కాకుండా నాడీ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

  • వెల్లుల్లిని నొప్పి నివారిణిగా చెప్పవచ్చు. కొబ్బరి నూనెలో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి ఆ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్ధన చేయాలి. మర్ధన చేయటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పి తగ్గుతుంది.

  • మసాలా టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన నొప్పిని నివారించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

  • పాల ఉత్పత్తులను తరచుగా తీసుకోవాలి. ఎందుకంటే ఎముకలకు బలాన్ని ఇచ్చే క్యాల్షియం.పాల ఉత్పత్తులలో సమృద్దిగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటే వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉండదు.

  • అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన ఆహారంలో అల్లంను తీసుకుంటే వెంటనే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.