హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే..అతనికి ఏం వచ్చిందో తెలుసా.? తర్వాత వచ్చిన మెసేజ్ చూసి ఇంకా షాక్.!       2018-06-26   01:00:14  IST  Raghu V

ఆన్లైన్ షాపింగ్ లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఆర్డర్‌ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం చూశాం. ఒక ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీకి హెడ్‌ఫోన్స్‌ కోసం ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ అనంతరం పరిణామాలకు గందరగోళంలో పడిపోయాడు. వివరాలలోకి వెళ్తే..

రెండుటీవీ హెడ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు. ఈ ప్యాకేజీ శుక్రవారం ఇంటికి చేరింది. అయితే ఆ సమయానికి ఇంట్లో లేకపోవడంతో అతడు శనివారం ఆ ప్యాక్‌ విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్‌ఫోన్‌కోసం ఎదురు చూసిన అతగాడు బాక్స్‌లో ఉన్నది చూసి బిత్తరపోయాడు హెడ్‌ఫోన్‌కు బమదులుగా ఒక హెయిర్‌ ఆయిల్‌ డబ్బా దర్శనమిచ్చింది. దీంతో బాధితుడు బాక్స్‌మీద ఉన్న టోల్‌ ఫ్రీకి (1800) ఫోన్‌ చేశాడు. ఫోన్‌ రింగ్‌ ఒకసారి మ్రోగి.. డిస్‌ కనెక్ట్‌ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్‌కు మళ్లీ డయల్‌ చేశాడు. సేమ్‌ ఎస్‌ఎంఎస్‌ రిపీట్‌.

కంపెనీకి చెందిన అసలైన టోల్‌ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన ఫిర్యాదు నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే..ఆయిల్‌ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్‌ఫోన్‌ సెట్‌ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్‌ చేస్తామంటూ సోమవారం ఉదయం షాపింగ్ పోర్టల్ నుండి కాల్‌ రావడం. దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వాళ్లు వచ్చి ఆదే బాటిల్‌ వాపస్‌ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టాడు అంట.

ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్‌ చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.