కడుపులో తల లేని బిడ్డ ఉందని తెలిసినా అబార్షన్‌కు ఒప్పుకోలేదు.. ఆమె నిర్ణయానికి హ్యాట్సాప్‌ అనాల్సిందే

మాతృత్వం అనేది ఏ దేశం వారిలో అయినా, ఏ జాతికి చెందిన వారిలో అయినా చివరకు జంతువుల్లో కూడా ఉంటుంది.పేగు తెంచుకు పుట్టిన ఎవరిని కూడా వదులుకునేందుకు తల్లి ఒప్పుకోదు.

 Head Less Baby In Stomach But She Did Not Get Abortion-TeluguStop.com

మాతృత్వంకు అద్దం పట్టే మరో సంఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగింది.క్రిస్టా డెవిస్‌ అనే 23 ఏళ్ల యువతి గర్బం దాల్చింది.

పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ప్రియుడితో కలిసి కొత్త జీవితంను ఆస్వాదించేందుకు రెడీ అవుతుంది.

పుట్టబోయే పాపాయికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది.అలాంటి సమయంలో క్రిస్టకు డాక్టర్లు కళ్లు తిరిగి పడిపోయేటువంటి విషయం చెప్పారు.

మూడు నెలల గర్బంతో ఉన్న క్రిస్టా కడుపులో ఉన్న శిషువుకు తల లేదని డాక్టర్‌ స్కానింగ్‌లో తేల్చాడు.తల లేకున్నా కూడా శిషువు కడుపులో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటాడని, కడుపులోంచి బయటకు వచ్చిన అర్థ గంటలో చనిపోతాడంటూ వైధ్యులు చెప్పారు.ఆమె పాదం కింద మట్టి లేచిపోయినట్లయ్యింది.ఆమె ఒక్కసారిగా అవాక్కయింది.ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు.ఆమెకు వైధ్యులు అబార్షన్‌ చేయించుకోమంటూ సలహా ఇచ్చారు.

మరో ఆరు నెలలు చనిపోయే పిండంను మోయడం వృదా అంటూ వైధ్యులు ఆమెకు సున్నితంగా చెప్పారు.కాని ఆమె మాత్రం అబార్షన్‌కు ఒప్పుకోలేదు.

క్రిస్టా తన ప్రియుడుతో మాట్లాడి కడుపులో పాపాయిని పెంచాలని నిర్ణయించుకుంది.ఇటీవలే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన పాపాయికి రైలీ అనే పేరు పెట్టారు.అర్థ గంటలో చనిపోతుందని చెప్పిన ఆ శిషువు వారం రోజుల పాటు జీవించి ఉంది.వారం తర్వాత మరణించిన ఆ శిషువు అవయవాలను క్రిస్ట మరియు ఆమె ప్రియుడు దానం ఇచ్చారు.ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఉన్నారు కాబటే ఈ భూమి ఉందని వారిపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

వారిద్దరికి అంతా కూడా హ్యాట్సప్‌ చెప్పాల్సిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube