భార్య బాధితులకు కోపం వచ్చింది ... అందుకే కాల్చిపడేశారు  

He Wife\'s Victims Got Angry Surpanaka Toy Burn And Protested-

చెడుపై మంచి విజయంగా చెప్పుకునే దసరా రోజున రావణుడి విగ్రహాన్ని దహనం చేయడం ఓ అనవాయితీ. దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణుడి విగ్రహాలను దహనం చేస్తుంటారు. అయితే ఈ దసరా సందర్భంగా కొందరు పురుషులు ఎవరూ ఊహించని విధంగా శూర్పణక దిష్టిబొమ్మను దహనం చేశారు..

భార్య బాధితులకు కోపం వచ్చింది ... అందుకే కాల్చిపడేశారు -He Wife's Victims Got Angry Surpanaka Toy Burn And Protested

రావణుడు చెల్లెలు కావడం వల్లే శూర్పణక దిష్టిబొమ్మను దహనం చేశారని అనుకుంటే మీరు అచ్చంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే శూర్పణక దిష్టిబొమ్మను దహనం చేసిన వారంతా భార్యా బాధితుల సంఘానికి చెందివారు. భర్తలను వేధించే భార్యలను శూర్పణకతో పోల్చుతూ… వీరంతా ఈ రకమైన వినూత్న నిరసన తెలిపారు.

‘పత్ని పీడిత్ పురుష్ సంఘటన్‌‌’కు చెందిన సభ్యులు ఔరంగాబాద్ సమీపంలోని కరోలి గ్రామంలో శూర్పణక దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పత్ని పీడిత్ పురుష్ సంఘటన్ వ్యవస్థాపకుడు భరత్ పులరే మాట్లాడారు.

దేశంలోని చట్టాలన్ని మహిళలకు అనుకూలంగా, పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. వీరిని దుర్వినియోగం చేస్తూ పలువురు మహిళలు భర్తలను, అత్తింటివారిని వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగానే తాము శూర్పణక బొమ్మను దహనం చేశామని చెప్పారు..