గుర్ర్రం ఎక్కి డ్యాన్స్ చేయ‌బోయాడు.. పాపం పెండ్లి కొడుకు ప‌రిస్థితి..

పెండ్లి అంటేనే స‌ర‌దా.స‌ర‌దా లేక‌పోతే అది పెండ్లి అనిపించుకోదు.

 He Was Going To Ride A Horse And Dance Sadly, Wedding, Bridegroom Felt Down, Fun-TeluguStop.com

అందుకే ఎవ‌రైనా స‌రే త‌మ జీవితంలో ఒకేసారి వ‌చ్చే ఈ వేడుక‌ను చాలా అద్భుతంగా జ‌రుపుకోవాల‌ని భావిస్తారు.అయితే ఈ స‌ర‌దా మితిమీరితేనే న‌వ్వుల పాలు కావాల్సి వ‌స్తుంది.

ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే.ఈ మ‌ధ్య పెండ్లిలో జ‌రుగుతున్న ఫ‌న్నీ సీన్ల గురించి చాలా వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

కాగా ఇప్పుడు ఓ పెండ్లి వేడుక‌లో స‌ర‌దా మితిమీరి చివ‌ర‌కు ఇబ్బంది పెట్టేసింది.అదేంటో ఇప్పుడు పూర్తి తెలుసుకుందాం.

ఈ వీడియో చూస్తే ఇందులో పెళ్లి కుమారుడి ఊరేగింపు జ‌రుగుతున్న‌ట్టు మ‌న‌కు తెలుస్తోంది.అయితే పెండ్లి కొడుకు ఎంచ‌క్కా గుర్రంపై ఉండి ఊరేగింపులో పాల్గొన్నాడు.బంధువులు ఆనందంలో ముందు డ్యాన్సులు కూడా చేస్తున్నారు.ఇక ఇంత‌లో ఓ వ్య‌క్తి పెండ్లి కొడుకు గుర్రం ఎక్కి నోట్లను వెద‌జ‌ల్లడం స్టార్ట్ చేశాడు.

అయితే ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా ఆ తరువాత జరిగిన దానితో అంద‌రూ షాక్ అయిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా నవ్వులు పూయిస్తోందంటే ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇలా డ‌బ్బులు జ‌ల్లుతున్న క్ర‌మంలో ఆ వ్య‌క్తి జేబులో నిత్యం చేతులు పెడెతున్నారు.ఇలా జేబులోంచి డ‌బ్బులు తీసుకునే క్ర‌మంలో స‌డెన్‌గా పట్టు తప్పిపోయాడు.ఇక కింద ప‌డ‌కుండా ఉండేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా కుద‌ర‌క‌పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న పెండ్లి కొడుకును ప‌ట్టుకున్నాడు.దీంతో ఆ పెండ్లి కొడుకు కూడా గుర్రం మీద నుంచి కిందపడిపోయాడు.

ఇది చూసిన వారంతా సాక్ అయిపోయారు.వెంట‌నే వారిద్ద‌రినీ లేపి స‌ర్దేశారు.

అయితే ఈ వీడియో చూసిన వారంతా కూడా తెగ న‌వ్వులు చిందిస్తున్నారు.మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube