ప్రమాదకర జీవులతో ఆటలాడొద్దు.ముఖ్యంగా క్రూర జంతువులగా ఉన్న వాటితో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే వాటికి ఆహారం అయిపోతుంటాం.ఇదే విషయం ఎన్నో ఘటనల్లో నిరూపితమయింది.
ఇక మొసళ్ల విషయానికి వస్తే మాత్రం వాటిని దూరం నుంచి మాత్రమే చూడాలి.లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
ఇక వాటితో విన్యాసాలు చేయాలని చూస్తే ఇంకేమైనా ఉందా.వాటికి ఆహారం అయిపోయినట్టే అవుతుంది.
అయితే ఈ విషయాన్ని మాత్రం ఓ వ్యక్తి మర్చిపోయి ఏదో చేయబోయి చివరకు ప్రాణాల మీదుకు తెచ్చుకున్నాడు.
అసలు మొసలికి చిక్కితే ఎంతటి బలమైన జంతువును అయినా దాని నోటితో పట్టేసుకుంటుంది.
దాని పట్టు ముందు ఎవరూ కూడా తప్పించుకోలేరు.అయితే కొన్ని ఈవెంట్లలో కొందరు మొసలితో విన్యాసాలు కూడా చేయిస్తుంటారు.
అయితే అది కూడా దూరంగా ఉండి చేయిస్తే ఓకే.కాగా ఇప్పుడు ఓ వ్యక్తి మాత్రం కొంచెం హద్దులు మీరి ప్రవర్తించాడు.ఇదే అతనికి పెద్ద మైనస్ అయింది.చివరకు ఆ మొసలి రియాక్ట్ కావడంతో తృటితో ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ వీడియోను చూస్తే ఇందులో ఓ వ్యక్తి మొసలితో నీటి పక్కన దానితో కర్ర సాయంతో ఆడిస్తుంటాడు.
అయితే విన్యాసాల్లో భాగంగా దాని నోటిలోకి చేతిని పెట్టడం మనకు కనిపిస్తుంది.అయితే అప్పటి వరకు అతనికి సహకరించిన మొసలి ఒక్కసారిగా నోటితో అతని చేతును కొరకుతుంది.ఉండు పట్టులాగా అతని చేతిని నోట్లోనే పట్టుకుంటుంది.
అయితే అతను బలంగా తన చేతిని లాక్కోవడంతో తీవ్ర రక్త స్రావాలతో చేతిని బటయకు లాక్కోగలుగుతాడు.ఈ క్రమంలో అతని చేతికి బలమైన గాయాలు కూడా అవుతాయి.
ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి షేర్ చేయగా.నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి పనులు అవసరమా అంటూ మండిపడుతున్నారు.