అమ్మాయిని చూస్తూ ఫీట్ చేయ‌బోయాడు.. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యిందే..

He Was Going To Do A Feat By Looking At The Girl But The Scene Was Reversed

మామూలుగానే అమ్మాయి చూపుల‌కు ఎంత‌టి వారు అయినా ఐస్ అయిపోతుంటారు.అలాంటిది ఏజ్ మీద ఉన్న అబ్బాయిలు కారా అంటే అతిశ‌యోక్తి కాదు.

 He Was Going To Do A Feat By Looking At The Girl But The Scene Was Reversed-TeluguStop.com

ఇక అబ్బాయిలు చాలామంది అమ్మాయిల‌ను ప‌డేసేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.ఏదో ఒక విధంగా అమ్మాయిని ఇంప్రెస్ చేయాల‌ని లేని పోని బిల్డ‌ప్‌ల‌కు పోయి చివ‌ర‌కు ఇబ్బందుల్లో ప‌డుతుంటారు.

ఇప్పటికే మ‌నం ఇలాంటి వీడియోలు అనేకం చూస్తున్నాం.ఇలాంటివి చూసిన త‌ర్వాత అయినా ఇలాంటి అన‌వ‌స‌ర బిల్డ‌ప్‌ల‌కు పోకూడ‌ద‌ని అబ్బాయిలు తెలుసుకోవ‌ట్లేదు.

 He Was Going To Do A Feat By Looking At The Girl But The Scene Was Reversed-అమ్మాయిని చూస్తూ ఫీట్ చేయ‌బోయాడు.. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొన్న‌టికి మొన్న ఓ అబ్బాయి ఇలాగే బైక్ మీద ఏదో స్టంట్లు చేయ‌బోయి చివ‌ర‌కు బొక్క బోర్లా ప‌డ్డాడు.ఇప్పుడు కూడా ఇలాంటి అబ్బాయే జిమ్‌లో ఏదో చేయబోయి చివ‌ర‌కు ఫల్టీలు కొట్టాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో న‌వ్వులు పూయిస్తోంది.ఈ వైరల్ వీడియోలో చూస్తే ఓ జిమ్ లో అమ్మాయి ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఆ అమ్మాయి కొంచెం సీరియ‌స్ గానే త‌న ప‌ని తాను చేస‌ుకుంటూ ఉంటుంది.ఇంత‌లో అక్క‌డ‌కు ఓ అబ్బాయి రావ‌డం కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఇక వ‌స్తూనే అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాడు.

త‌న ముందు ఉన్న ట్రెడ్ మిల్ మీద ఏదో చేయాల‌నుకుంటాడు.వెంట‌నే ఆ అమ్మాయిని పిలిచి త‌న స్టంట్లు చూడాలంటూ సైగలు చేస్తుంటాడు.ఇక ఆ అమ్మాయి కూడా మ‌నోడి స్టంట్లు చూస్తుంది.

ఇక అత‌ను ఎదురుగా ఉన్న ట్రెడ్‌మిల్‌పై స్టైల్ గా కాలు పెట్టబోయాడు.ఇంకేముంది అప్ప‌టికే ర‌న్నింగ్ మీద ఉన్న ఆ ట్రెడ్ మిల్ ఒక్క‌సారిగా కింద‌కు ప‌డేస్తుంది.

మ‌నోడు బొక్కబోర్లా పడ్డాడు.ఇక వెంట‌నే పైకి లేచి ఏదో క‌వ‌ర్ చేయ‌బోయి పుషప్స్ మొదలుపెట్టాడు.

దీన్నంతా కూడా ఆ అమ్మాయి చూస్తూనే ఉంటుంది.ప‌క్క‌నున్న వారు ఇదంతా వీడియో రికార్డు చేశారు.

#Exercise Feats #Boy #Treadmill #Impress #Feats

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube