విడ్డూరం : ప్రియురాలి ఫోన్‌ చూసిన పాపంకు అతడికి ఎంత పెద్ద శిక్ష పడిందో తెలిస్తే అవాక్కవుతారు

మానవ సంబంధాలు, ప్రేమలు ఎంత పలుచన అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.భార్య భర్తలు, ప్రేయసి ప్రియుడు, అన్న చెల్లి, అక్క తమ్ముడు ఇలా అన్ని బంధాల్లో కూడా అపార్థాలు, గొడవలు వస్తూనే ఉన్నాయి.

 He Was Arrested For Seeing Lover Mobile-TeluguStop.com

కొన్ని గొడవలకు కారణం ఆర్థిక పరమైన విషయాలు అయితే ఎక్కువ శాతం గొడవలకు మాత్రం అపార్థాలు, అనుమానాలు.ముఖ్యంగా భార్య భర్తలు మరియు ప్రేయసి ప్రియుడి మద్య విభేదాలకు ప్రధాన కారణం అనుమానం, అక్రమ సంబంధం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా ఇంగ్లాండ్‌లో లవర్స్‌ మద్య ఇలాంటి విభేదాలు తలెత్తాయి.దాంతో ప్రేయసి కోర్టుకు ఎక్కడం, ప్రియుడు జైలుకు వెళ్లడం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇంగ్లాండ్‌ గ్రేటర్‌ మాంచెస్టర్‌లో అలెక్స్‌ హెవెన్‌ మరియు స్టేసీలు సహజీవనం సాగిస్తున్నారు.వీరిద్దరు చాలా కాలంగా కలిసి జీవితంను సాగిస్తున్నారు.వీరిద్దరు హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో అతడికి అనుమానం వచ్చింది.

ఆమె ప్రవర్తన, ఆమె స్నేహితుల గురించి వాకబు చేయడం మొదలు పెట్టాడు.అదే సమయంలో ఆమె ఫోన్‌లోని ఫొటోలు మరియు చాట్‌ను చూడాలని అతడు అనుకున్నాడు.

ఆమె పడుకున్న సమయంలో ఆమె వేలితో ఐఫోన్‌ అన్‌లాక్‌ చేశాడు.ఆ తర్వాత ఆమెకు సంబంధించిన చాట్‌ మరియు ఫొటోలను చూశాడు.

విడ్డూరం : ప్రియురాలి ఫోన్‌ చూ

అందులో కొన్ని అనుమానం కలిగించేవిగా ఉన్నాయి.దాంతో ఆమె నిద్రలేచిన తర్వాత వాటి గురించి అడగాలని భావించాడు.తర్వాత రోజు ఇద్దరు కలిసి కూర్చున్నారు.అప్పుడు ఆమెను అలెక్స్‌ ఫోన్‌లోని ఫొటోల గురించి అడిగాడు.దాంతో ఆమె తీవ్ర ఆగ్రహంకు లోనైంది.నా ఫోన్‌ను ఎందుకు చూశావు, నా అనుమతి లేకుండా నువ్వు ఫోన్‌ను ఎలా తీసుకున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దాంతో అతడు కూడా సహనం కోల్పోయి ఆమెపై దాడి చేశాడు.దాంతో ఆమె అతడిపై ఫిర్యాదు చేసింది.

కోర్టు అతడికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది.అనుమతి లేకుండా ఆమె ఫోన్‌ను తీసుకోవడంకు ఆరు నెలలు కాగా, ఆమెపై దాడి చేసినందుకు గాను ఆరు నెలల జైలు శిక్షను కోర్టు విధించడం జరిగింది.

ఇంత చిన్న విషయంకు కోర్టు వరకు వెళ్లిన ఇలాంటి జంటలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఎన్నో ఉన్నాయి.అదృష్టవశాత్తు మనదేశం ఇంకా అంత అభివృద్ది చెందలేదు.

అలా మనదేశం అభివృద్ది అవ్వకుంటేనే మంచిదనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube