ట్యాలెంట్ చూపించాల‌నుకున్నాడు.. కానీ ఇలా జ‌రిగిందేంటి..

సోషల్ మీడియాలో మ్యారేజ్‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి.బుల్లెట్టు బండి సాంగ్‌కు నూతన వధూవరులు చేసిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి అందరికీ విదితమే.

 He Wanted To Show Talent But What Happened, Wedding, Viral Video, Official Viral-TeluguStop.com

కాగా, తాజాగా మ్యారేజ్ సందర్భంగా తన టాలెంట్‌ను ప్రదర్శించి పాపులర్ అవుదామనుకుని నవ్వుల పాలయ్యాడు ఓ వ్యక్తి.అతడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.

సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది తమ టాలెంట్‌ను బయట ప్రపంచానికి చూపించి అవకాశాలు కూడా దక్కించుకున్నారు.అయితే, వైరల్ అవుతున్న వీడియలో ఓ వ్యక్తి తన డ్యాన్స్ టాలెంట్ చూపించి స్టార్ అవుదామనుకున్నాడు.

కానీ, ఆయన అనుకున్నదానికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది.మ్యారేజ్ వేడుకలో ఇద్దరు అబ్బాయిలు డ్యాన్స్ చేద్దామనుకున్నాడు.

ఈ క్రమంలో ఓ అబ్బాయి తనకు వచ్చిన డిఫరెంట్ స్టెప్ చేసి తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకోవాలనుకున్నాడు.అందులో భాగంగా ఓ స్టెప్పు వేసేందుకుగాను ఆ అబ్బాయి స్టేజీపైనే కొద్దిగా వెనక్కు వెళ్లాడు.

ఆ తర్వాత అమాంతంగా ఒకేసారి తన కాలును లేపి స్టెప్ వేద్దామనుకున్నాడు.కానీ, స్టేజ్‌పై వేసిన డెకరేషన్ తన కాలుకు అడ్డుగా వచ్చింది.

దాంతో డెకరేషన్ ఎక్కడిక్కడ చినిగిపోయి అబ్బాయి స్టేజీపైనే కిందపడిపోయాడు.దాంతో అది చూసిన జనాలు నవ్వుకున్నారట.

ఈ ఫన్నీ సంఘటనను రికార్డు చేసిన కొందరు అఫీషియల్ వైరల్ క్లిప్స్ అనే ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేశారు.అంతే.ఆ వీడియో బాగా వైరలవుతోంది.ఈ వీడియో చూసి నెటిజన్లు ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.‘బ్రదర్ చించేశావ్ పో, బ్రదర్ నువ్వు టాలెంట్‌ను చూపించబోయి డెకరేషన్ చించేశావు, అనుకున్నదొకటి అయిందొకటి’ అని కామెంట్స్ చేస్తున్నారు.పాపం ఏదో చేద్దామనుకున్నాడు కానీ , టైమ్ బ్యాడ్ అయి ఇంకేదో అయిందని అంటున్నారు.

మొత్తంగా ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube