కొండ చిలువ‌తో ఆడుకోవాల‌నుకున్నాడు.. కానీ

నెట్టింట యానిమల్స్, బర్డ్స్‌కు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు.అయితే, అటువంటి వీడియోల్లో కొన్ని చూడగానే చాలా ఫన్నీగా అనిపిస్తంటాయి.

 He Wanted To Play With The Python But, Python, Viral News, Viral Animals Video,-TeluguStop.com

మరికొన్ని వీడియోలయితే చూస్తే చాలు భయం మనల్ని వెంటాడుతుంటుంది.ఈ భయపెట్టే కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సదరు వైరల్ వీడియోలో ఓ భారీ కొండ చిలువ మెరుపు దాడి చేయడం చూస్తే ఎవరికైనా కంపల్సరీ భయం వేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.వీడియో వివరాల్లోకెళితే.

కాలిఫోర్నియాకు చెందిన రెప్‌టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ తరచూ డిఫరెంట్ యానిమల్స్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారు.ఇందులో కొండచిలువల వీడియోలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ స్కేరీ వీడియో పోస్ట్ చేశాడు.ఇందులో జే బ్రూవర్ కొండచిలువతో క్రేజీ ఆటలు ఆడుతుంటే.

సడెన్‌గా కొండ చిలువ మెరుపు దాడి చేస్తుంది.అయితే, ఆ దాడి నుంచి జే బ్రూవర్ తప్పించుకోవడం గమనార్హం.

ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

అయితే, పైథాన్ తనపై దాడి చేయడానికి గల కారణాన్ని ఇన్ స్టా వేదికగా జే బ్రూవర్ వివరించాడు.కొండ చిలువ ఉన్న ప్రదేశానికి దగ్గర్లో దాని గుడ్లు ఉన్నాయని, అవి తాను తీయడానికి ప్రయత్నించాననుకుని కొండ చిలువ దాడికి దిగిందని పేర్కొన్నాడు.కాగా ఈ వీడియో చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు.

జే బ్రూవర్ గ్రేట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం కొండ చిలువ దాడి ఇంత భయకరంగా ఉంటుందా అని పోస్టులు పెడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువుల భీకర ఫైటింగ్‌కు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కొండ చిలువ వీడియో తెగ వైరలవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube