చేతుల‌కు తాటిక‌మ్మ‌లు క‌ట్టుకుని ప‌క్షిలా ఎగ‌రాల‌నుకున్నాడు.. చివ‌ర‌కు

He Wanted To Fly Like A Bird With His Palms Tied To His Hands To The End

పిల్ల‌లు చేసే ప‌నులు మ‌న ఊహ‌కు కూడా అంద‌కుండా ఉంటాయి.వారు ఏదైనా చూస్తే వెంట‌నే అలాగే చేయాల‌ని భావిస్తుంటారు.

 He Wanted To Fly Like A Bird With His Palms Tied To His Hands To The End-TeluguStop.com

ఏదైనా వింత‌గా అనిపించిన దాన్ని చూస్తే గ‌న‌క వెంట‌నే అలాగే చేయాల‌ని ఏదో ఒక ప్ర‌య‌త్నం కూడా చేస్తుంటారు.వారి ఊహ‌లు ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా ఉంటాయి కాబ‌ట్టే చిన్న పిల్ల‌ల ప‌నులు అంద‌రికీ అంత వింత‌గా అనిపిస్తుంటాయి.

ఇక ఇప్పుడు ఓ పిల్లాడు చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.సాధార‌ణంగా ఆకాశంలో ఎగ‌రాల‌ని ఎవ‌రికైనా ఉంటుంది.

 He Wanted To Fly Like A Bird With His Palms Tied To His Hands To The End-చేతుల‌కు తాటిక‌మ్మ‌లు క‌ట్టుకుని ప‌క్షిలా ఎగ‌రాల‌నుకున్నాడు.. చివ‌ర‌కు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప‌క్షిలా ఎగ‌రాల‌ని ఎవ‌రైనా క‌ల‌లు కంటారు.

ఇక ఆ పిల్లాడు కూడా అలాగే ఎగ‌రాల‌నుకున్నాడు.

త‌న కుటుంబం అంతా క‌లిసి గుడిసె మీద తాటిక‌మ్మ‌లు వేసుకుంటున్నారు.ఒక‌వైపు కుటుంబ స‌భ్యులు ఒక్కొక్క‌టిగా తాటి క‌మ్మ‌ల‌ను సేక‌రిస్తూ గుడిసె మీద క‌ప్ప‌డం మ‌న‌కు ఈ వైర‌ల్ వీడియోలో క‌నిపిస్తుంది.

ఇక ఆ పిల్లాడికి మాత్రం త‌న ప్ర‌య‌త్నంలో తాను ఉన్నాడు.ఎలాగైనా ఎగ‌రాల‌ని రెండు చేతులకు రెండు తాటిక‌మ్మ‌లు కట్టుకున్నాడు.

ఆ కమ్మల సాయంతో ఎలాగైనా ఎగ‌రాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు.వాటితో గుడిసె మీద నుంచి ఏకంగా కింద‌కు దూకేందుకు ప్ర‌య‌త్నిస్తాడు.

అయితే త‌న వెన‌కాలే ఉన్న కుటుంబ స‌భ్యులు వ‌ద్ద‌ని వారిస్తున్న‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.కానీ వింటే పిల్ల‌లు ఎందుక‌వుతారు.అందుకే ఆ పిల్లాడు కూడా విన‌కుండా అమాంతం గుడిసె మీద నుంచి కింద‌కు దూకేస్తాడు.దీంతో ప‌డిపోతాడు.అత‌ని ఐడియా ప్ర‌తి ఒక్క‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది.ఇదంతా అక్క‌డే ఉన్న వారు కెమెరాల్లో వీడియో తీయ‌గా దాన్ని ఐఏఎస్ ఆఫీస‌ర్ అశ్విన్ శరణ్ నెట్టింట షేర్ చేశారు.

ఇంకేముంది విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.కాగా ఈ పిల్లాడు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వ్య‌క్తిగా ఇందులో తెలుస్తోంది.

.

#Fly Bird #Kid Fly #Boy Fly #Tree Branches #Soical

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube