వామ్మో: ఆయన సముద్రంలో గొలుసులు బిగించుకొని మరి..!?

సాధారణంగా 50 ఏళ్లు దాటాక మనుషుల్లో సత్తువ అనేది నెమ్మది నెమ్మదిగా క్షీణించడం సహజం.ఈ వయసు వారు ఇంటి పనులు చేయగలుగుతారేమో గానీ సాహసయాత్రలు వంటివి చేయడం దాదాపు అసాధ్యం.

 He Tightened The Chains In The Sea And, Udipi Man, Swimming, Chains, Viral News-TeluguStop.com

అయితే తాజాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు సిద్ధపడ్డాడు 66 ఏళ్లకు చెందిన ఓ వ్యక్తి.సంకల్పం ఉంటే.ఏదైనా సాధించవచ్చాని.దానికి వయసు అడ్డురాదని నిరూపించారు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కిదియూరుకు చెందిన గంగాధర కడేకర్‌.

మామూలుగా కాలువలో ఈత కొట్టడం అంటేనే ఎందరికో భయం.అలాంటిది ఓ 66 ఏళ్ల వ్యక్తి ఏకంగా అరేబియా సముద్రం లోనే ఈత కొట్టాడు.అదీ కూడా కాళ్లకు గొలుసులు కట్టుకుని మరీ.మూడు కిలోమీటర్లకు పైగా ఈతకొట్టి ఆ వ్యక్తి ఎందరినో ఆశ్చర్యపరిచాడు.ఈయన చేసిన సాహసానికి.గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది.సోమవారం ఆయన అరేబియా సముద్రం లోని కిదియూరు వద్ద ఉదయం 7.50 గంటలకు ఈత కొట్టడాన్ని ఈయన ప్రారంభించారు.అప్పటి నుండి ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 5.35 గంటలపాటు ఈది మూడు కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇలా ఈదడం కోసం ఎన్నో రోజులు కష్టపడ్డానని.అందుకు ప్రతిఫలం దక్కిందని అన్నారు.సాహసాలు చేయడం అంటే ఇష్టమని.

అందులో భాగంగానే ఈత కొట్టేటప్పుడు గొలుసులు కట్టుకొని ఈత కొట్టడం ప్రాక్టీస్ చేసానని తెలిపారు.కాగా, పలువురు ఈయన సాహసాన్ని చూసి ఔరా.! అంటుండగా.పలువురు అసలు కాళ్లకు గొలుసులు కట్టుకుని ఈదడం ఎలా సాధ్యపడింది అంటూ ప్రశ్నిస్తున్నారు.

He Tightened The Chains In The Sea And, Udipi Man, Swimming, Chains, Viral News, Viral Latest, Viral News, Social Media - Telugu Chains, Udipi, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube