ఈరోస్‌ చేతికి ‘గబ్బర్‌సింగ్‌`2’  

Eros International Bags Gabbar Singh 2 Rights -

‘అత్తారింటికి దారేది’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌తో పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్‌ ఆకాశాన్ని అంటేలా ఉంది.ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం ‘గబ్బర్‌సింగ్‌`2’.

ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.పవన్‌ కళ్యాణ్‌ ఫుల్‌ గడ్డంతో ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో నటించనున్నాడు.

TeluguStop.com - Eros International Bags Gabbar Singh 2 Rights--Telugu Tollywood Photo Image

అందుకోసం గత కొన్ని రోజులుగా గడ్డంతోనే పవన్‌ కళ్యాణ్‌ ఉంటున్నాడు.మొదట ఆ గడ్డం సీన్స్‌ను తీసి, ఆ తర్వాత ఇతర సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాకు మెగా అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో సైతం అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమాకు ఉన్న భారీ క్రేజ్‌ దృష్ట్యా బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ సినిమా రైట్స్‌ను హోల్‌ సేల్‌గా తీసుకునేందుకు ముందుకు వచ్చింది.

ఈ సినిమా రైట్స్‌ కోసం ఈరోస్‌ సంస్థ ఏకంగా నిర్మాతకు 72 కోట్ల ఆఫర్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.థియేటర్‌ రైట్స్‌తో పాటు ఆడియో, ఆన్‌లైన్‌, శాటిలైట్‌ రైట్స్‌కు కలిపి ఈ మొత్తంగా తెలుస్తోంది.

ఇంత భారీ స్థాయిలో విడుదలకు ముందే పవన్‌ సినిమా బిజినెస్‌ చేయడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.‘పవర్‌’ ఫేం బాబీ దర్శకత్వంలో శరత్‌ మారార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Eros International Bags Gabbar Singh 2 Rights Related Telugu News,Photos/Pics,Images..