కూతురు కాలేజ్ ఫీజు కూడా కట్టలేకపోయాడు ,కానీ ఇప్పుడు అందరికి 1 రూ.. భోజనం పెడుతున్నాడు...

కూతురు కాలేజ్ ఫీజు కూడా కట్టలేకపోయాడు ,కానీ ఇప్పుడు అందరికి 1 రూపాయికే భోజనం పెడుతున్నాడు…

 He Struggles To Pay His Daughter College Fees But Provides Meals To The Needy-TeluguStop.com

ఒక రూపాయి జేబు లో పెట్టుకొని బయటకి వెళ్లి కడుపు నిండా అన్నం టీజీని రావడం సాధ్యమేనా ? కాదు కదా .కానీ తమిళనాడు లోని ఏరోడ్ అనే ఊరిలో వి.

వెంకట రామన్ ఆకలితో ఉన్నవాళ్ళకి ఒక రూపాయికే భోజనం అందిస్తున్నాడు.
ఆకలితో ఉన్నవాళ్ళకి జీవితం మీద ఆశ కలిగిస్తున్నాడు.

అసలు వెంకట రామన్ కథ ఏంటో తెలుసుకుందాం.

మానవత్వం గురించి గాంధీ ఏం చెప్పారంటే మానవత్వం పైన ఎప్పుడు ఆశ వదులుకోకు , మానవత్వం అనేది సముద్రం లాంటిది .అందులో కొన్ని నీటి చుక్కలు కల్తీ అయినంత మాత్రాన సముద్రమంతా మురికి అవదు.

చెన్నై కి 500 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఏరోడ్ అనే చిన్న గ్రామం లో ఆకలి తో ఉండి కనీసం భోజనం కూడా చేయలేని వారి కడుపులు నింపుతూ మానవత్వం చాటి గాంధీ గారి మాటలని నిజం చేసాడు.

అసలు 1 రూపాయికి భోజనం పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే.

కొన్ని సంవత్సరాల క్రితం వెంకట రామన్ AMV మెస్ పక్కనే ఏరోడ్ జనరల్ హాస్పిటల్ కి వచ్చిన ఒక దంపతులు , అందులో భర్త కి బాగలేకపోవడం వల్ల అతనికి ఏదైనా తినిపించాలని దగ్గర్లో ఉన్న వెంకట రామన్ హోటల్ కి వచ్చి 10 రూపాయల ఇడ్లీలు అడిగింది కానీ అప్పటికే ఇడ్లీలు అయిపోయాయి ,అప్పుడు వెంకట రామన్ 10 రూపాయల దోశ తీసుకెళ్లామన్నాడు కానీ ఆమె దోశ బదులు ఇడ్లీలే కావలంది.

ఎందుకంటే 10 రూపాయలకి AMV మెస్ లో 6 ఇడ్లీలు వస్తున్నాయి , అదే దోశ అయితే మూడే వస్తున్నాయి.ఆమె దగ్గర 10 రూపాయల కన్నా ఎక్కువ డబ్బు లేదు పైగా భార్యాభర్తలు ఇద్దరు ఆ రాత్రికి కడుపు నింపుకోవాలి దాన్ని చూసిన వెంకట రామన్ ఆమెకి 10 రూపాయలకే 6 దోశలు ఇచ్చి పంపించాడు.

ఆ సంఘటన జరిగిన తరువాత ఏ హోటల్ యజమాని అయిన వెంటనే మర్చిపోతారు కానీ వెంకట రామన్ ఆ సంఘటనని బాగా ఆలోచించాడు.పక్కన ఉన్న గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి లో ఎక్కువగా డబ్బు లేని కూలీలు , నిరుపేదలు వస్తుంటారు .దీనితో ఆయన వారికోసం ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు.

1 రూపాయికే రుచికరమైన భోజనం

వెంకట రామన్ ఆయన భార్య కలిసి ప్రతి రోజు పక్కనున్న ఆసుపత్రి కి వెళ్లి రూపాయి విలువ గల 20 టోకెన్లు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి వచ్చేవారు , ఆ టోకెన్ల తో ఆయన మెస్ లో కడుపు నిండా భోజనం చేయచ్చు.ఇప్పుడు ఆయన రోజుకు 70 టోకెన్లను పంచుతున్నారు.ఆయన మధ్యతరగతి కుటుంబం కాబట్టి వారి కుటుంబం ఈయన ఆదాయం పైనే ఆధారపడి ఉంది.

ఈయనకి ఇద్దరు కూతుళ్లు ఒక కూతురికి పెళ్లి అయిపోయింది , ఇంకో కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది.ఆయన చిన్న కూతురు చదువు అయిపోయి ఉద్యోగం చేస్తే మరింత మందికి భోజనం పెట్టొచ్చు అని వెంకట రామన్ ఆలోచన.

కూతురుని చదివించడానికి డబ్బు లేక

వెంకట రామన్ హోటల్ పెట్టకముందు ఆయన కూతుళ్ళ చదువులకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితి.ఆకలి తో ఉన్నవాడికే అన్నం విలువ తెలుస్తుంది.

అటువంటి రోజులు ఆయన జీవితం లో ఉన్నాయి కాబట్టే ఈ రోజు అంతమంది ఆకలి తీరుస్తున్నాడు.వెంకట రామన్ లాంటి మానవత్వం ఉన్న వారు ఊరికి ఒక్కరు ఉన్న చాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube