నేటి యువతలో నానాటికీ విలువలు మంటగలిసి పోతున్నాయి.గురువు అన్న వాడికి విలువే లేకుండా పోతోంది సమాజంలో.
అందరిమాట దేవుడెరుగు? తోటి స్టూడెంట్స్ టీచర్లపట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్న ఘటనలు మనం ప్రతిరోజూ చూస్తున్నాం.తాజాగా అంతకుమించిన ఘటన ఒకటి జరగడంతో సోషల్ మీడియా వేడెక్కిపోతోంది.
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి (17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది.పగబట్టిన విద్యార్థి బాత్‌రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్‌ను వెంబడించి మరీ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి మట్టుబెట్టాడు.
ఆ తరువాత హెడ్ మాస్టర్ ( Head Master )ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకొని విచారణ చేస్తున్నారు.

తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్‌లో ( Dhamora Govt Higher Secondary School )జరిగినట్టు సమాచారం.వివరాల్లోకి వెళితే, ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్‌లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు హాజరవుతాడు.ఈ క్రమంలోనే శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా( Surendra Kumar Saxena )(55) నిందితుడిని, మరో విద్యార్థిని మందలించి, కొట్టడం జరిగింది.దాంతో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు.ఆ తరువాత వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి మరీ కాల్చి చంపేశాడు.విషయం తెలుసుకున్న జనాలు అసలు సమాజం ఎటుపోతుందో తెలియడంలేదని వాపోతున్నారు.

ఆ సమయంలో తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడి లేచి, వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు.ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించడంలో దర్యాప్తు చేస్తున్నారు.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నట్టు తెలుస్తోంది.కాగా హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది.