ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య నల్లగా ఉందంటూ..!  

he says wife is black after giving birth to three children wife black, three childrens ,filed case, Vatti Cherukuru, Divorce, SP Ammi Reddy, Marriage - Telugu Divorce, Filed Case, Marriage, Sp Ammi Reddy, Three Childrens, Vatti Cherukuru, Wife Black

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అపురూపమైన ఘట్టం.పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్క ఆడపిల్ల కలలు కంటుంది.

TeluguStop.com - He Says Wife Is Black After Giving Birth To Three Children

అలా పెళ్లి లో ఎటువంటి కష్ట,నష్టం వచ్చినా కూడా జీవితాంతం తనకు తోడుగా ఉంటానని వరుడు ప్రమాణం చేస్తాడు.అలా పెళ్లైన వారి ఎంతో మంది జీవితంలో కష్టాల తో కలిసి ప్రయాణం చేస్తుంటారు.

మరికొందరు మధ్యలోనే వారి జీవితం చాలా ఇస్తారు.అయితే తాజాగా గుంటూరులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది.

TeluguStop.com - ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య నల్లగా ఉందంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వట్టిచెరుకూరుకు చెందిన ఓ మహిళ నల్లగా ఉన్నానని తన భర్త తన దగ్గర నుంచి విడాకులు కోరుతున్నాడని, విడాకులు ఇవ్వకపోతే చంపేస్తాననీ బెదిరిస్తున్నట్లు ఓ మహిళ ఎస్పీని సంప్రదించి కన్నీటి పర్యంతం అయ్యింది.అయితే పోలీసులు తెలిపిన వివరాల మేరకు….

వట్టిచెరుకూరు కు చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి 2015 సంవత్సరంలో పెళ్లి జరిగింది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు.

అయితే పెళ్లైన ఐదు సంవత్సరాలకు తన భార్య నల్లగా ఉందని, ఈమె అడ్డు తొలగించుకుని మరొక పెళ్లి చేసుకోవాలని భావించాడు.అందుకోసమే తన భార్యను విడాకులు ఇవ్వాల్సిందిగా బలవంత పెట్టాడు.

ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో, ఆమె అత్తింటి వారు చివరికి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

అత్తింటివారు ఆమెను ఎన్నో బాధలకు గురి చేశారని, వారి బాధలను భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.

కానీ తనకు పుట్టిన పిల్లల కోసం ఆ ఆలోచనను విరమించుకుంది.కానీ అత్తింటివారి నుంచివేధింపులు తగ్గలేదు.

విడాకులు ఇవ్వాల్సిందిగా బలవంత పెట్టేవారు.ఒకరోజు కిరోసిన్ తీసుకొని ఆమెను హత్య చేయడానికి పాల్పడగా ముందుగానే పసిగట్టిన ఆ భార్య కేకలు వేస్తూ పిల్లల్ని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

తన ప్రాణాలకు హాని ఉందని వెళ్లి పోలీసులను ఆశ్రయించింది.తన అత్తింటివారి నుంచి ప్రాణభయం ఉందని, తనను రక్షించాలని స్థానిక అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డికి ఫిర్యాదు చేసింది.

ఆమె సమస్యకు స్పందించిన ఎస్పి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

#Wife Black #SP Ammi Reddy #Filed Case #Three Childrens #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

He Says Wife Is Black After Giving Birth To Three Children Related Telugu News,Photos/Pics,Images..