సునీత బంధువు అంటూ రూ.లక్షలు లక్షలు గుంజాడు.. చివరికి ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సింగర్ సునీత గురించి అందరికీ పరిచయమే.తన పాటలతో, మాటలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది.

 He Said Sunitas Cousin Take Lakas Of Rupees What Happened In The End-TeluguStop.com

మొదట బుల్లితెరపై వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా చేసింది సునీత.ఆ తర్వాత వెండితెరపై సింగర్ గా అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకుంది.

గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు అనే పాటను తొలిసారిగా పాడి అందరి హృదయాలను దోచుకుంది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసింది.

 He Said Sunitas Cousin Take Lakas Of Rupees What Happened In The End-సునీత బంధువు అంటూ రూ.లక్షలు లక్షలు గుంజాడు.. చివరికి ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తన బంధువు అంటూ ఒక వ్యక్తి రూ.లక్షలు లక్షలు గుంజాడట.

ఎన్నో ఏళ్ళు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత ఇటీవలే మరో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.కొన్ని నెలల కిందట ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడుపుతుంది.

ఇక ఈమె పెళ్లికి ముందే కాకుండా పెళ్లి తర్వాత కూడా ఎన్నో పుకార్లు ఎదుర్కొంది.కానీ వాటిని పట్టించుకోకుండా తానేంటో తన దారి ఏంటో మాత్రమే ఆలోచిస్తుంది.

ఇదిలా ఉంటే గతంలో తన పేరు చెప్పి ఒక వ్యక్తి మోసం చేసి డబ్బులు వసూలు చేశాడట.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

తనకు ఎప్పుడు తలదించుకునే పరిస్థితి రాలేదని తెలిపింది.ఇక తనకు గులాబీ, ఎగిరే పావురమా సినిమాలలో పాడిన పాటలు మంచి పేర్లు తెచ్చాయని తెలిపింది.

Telugu Cousin, Dubbing Artist, Lakhs Rupes, Man Take Lakhs Of Money, Ram Veerapanenei, Second Marriage, Singer Sunitha, Sunitha Relative, Tollywood-Movie

తనకు ఆత్మగౌరవం దెబ్బతినే సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం వాటి విషయంలో నిశ్శబ్దంగా లేను అని తెలిపింది.ఇక ఓ వ్యక్తి తమ బంధువు అని చెప్పి డబ్బులు వసూలు చేశాడని తెలిపింది.

ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రెటీలకు ఇటువంటి అనుభవాలు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి అని తెలిపింది.ఇక ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో డబ్బులు వసూలు చేశాడో తెలియదు కానీ.

ఓ వ్యక్తి అవతలి వ్యక్తిని డబ్బులు అడుగుతుంటే అసలు ఇచ్చే వాడికి కనీస జ్ఞానం కూడా ఉండక్కర్లేదా అంటూ ప్రశ్నించింది.ఇక అందులోనే కొందరు అమాయకులు కూడా ఉంటారని తెలిపింది.

ఒకవేళ ఆ డబ్బులు వసూలు చేసిన వ్యక్తి తమ బంధువు అయితే తానే స్వయంగా డబ్బులు ఇచ్చే దానిని.

Telugu Cousin, Dubbing Artist, Lakhs Rupes, Man Take Lakhs Of Money, Ram Veerapanenei, Second Marriage, Singer Sunitha, Sunitha Relative, Tollywood-Movie

ఎందుకంటే జనాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అంటూ అంతేకానీ ఇలా పేర్లు చెప్పి డబ్బులు తీసుకోవడం అసలు కరెక్ట్ కాదు అని కోపం అయింది.ఇక ఆ వ్యక్తి ఎవరికి ఫోన్ చేసినా ట్రూ కాలర్ లో సునీత ఉపద్రష్ట, సునీత సింగర్ అనే పేరు వస్తుందని.అదంతా ట్రాప్ చేయడానికి అలా పేర్లు వాడుకుంటారు అని బయట పెట్టింది.

ఇక చాలా మంది సెలబ్రెటీలు కూడా తనను కలిసినప్పుడు మీ నుంచి టెక్స్ట్ మెసేజ్ లు వస్తున్నాయి అంటూ.మీతో చాట్ చేశామని అన్నప్పుడు చాలా సీరియస్ గా అనిపించిందని అయితే వీటిని ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవడంతో అందరికీ ఫోన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి న్యాయపరంగా చేయాల్సిన పని చేశాను అని తెలిపింది.

#Lakhs Money #Cousin #Lakhs Rupes #Artist #Sunitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు