ఒక్క రోజులో 834 అమ్మాయిల కి ప్రొపోజ్ చేసాడు

ప్రేమికుల దినోత్సవం రోజున ఏ కుర్రాడు తనకి ఫ్లవర్ ఇస్తాడా అని ఎదురు చూడని అమ్మాయి ఉండదు.ముఖ్యంగా టీనేజీ అమ్మాయిల లో ఈ వ్యామోహం చాలా ఎక్కువగా ఉంటుంది.

 He Proposed 834 Girls In Single Day-TeluguStop.com

తాను ఇష్టపడిన అబ్బాయి ఇస్తే ఇంకేం అమ్మాయికి పండగే పండగ.కానీ తన తోటివారు ఎవరో ఒకరి నుంచి గిఫ్ట్ ని అందుకుని తనకి మాత్రం కనీసం రోజా పువ్వు కూడా అందకపోతే ఆమె చాలా బాధ పడుతుంది.

డిప్రెషన్ కి కూడా గురైన సందర్భాలు లేకపోలేదు.ఇదంతా ఆలోచించిన ఒక అమెరిఅక కుర్రాడు ప్రేమికుల దినోత్సవం రోజున ఏ అమ్మాయీ గులాబీ అందలేదు అని బాధపడకూడదు అనే కోరిక తో చిత్రం గా ఆలోచించాడు.

తాను స్కూలు లో అమ్మాయిలు అందరికీ ఈ పువ్వు ఇవ్వాలని అనుకున్న అతను దీనికోసం కొన్ని నెలల పాటు మెక్ డొనాల్డ్స్ లో క్లీనర్ గా పని చేసి మరీ ముప్పై వేలు ఖర్చు పెట్టాడు తాను సంపాదించిన సంపాదనలో రూ.30వేలు ఖర్చు చేసిన స్కూల్లోని 834 మంది అమ్మాయిలకు వాలెంటైన్స్ డే నాడు గులాబీలు బహుకరించాడు.ఇందుకోసం మూడు వారాల నుంచి ప్రయత్నాలు మొదలెట్టిన హేడెన్.తన 20 మంది స్నేహితులతో కలిసి పూలు ఆర్డర్ చేయటం.వాటిని నీట్ గా కట్ చేసి.ప్యాక్ చేసి స్కూల్లోని అమ్మాయిలందరికి పంచిపెట్టాడు.

కొస మెరుపు ఏంటంటే ఆ అబ్బాయి కి గర్ల్ ఫ్రెండ్ ఉండడం తను కూడా ఇతను చేసిన పనికి మెచ్చుకోవడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube