మొస‌లితో ప‌రాచ‌కాలు ఆడాడు.. కానీ చివ‌ర‌కు

క్రూర మృగాల‌తో ఆట చాలా డేంజ‌ర్‌.ఎందుకంటే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ‌రికీ తెలియ‌దు.

 He Played With The Crocodile But In The End Details, Crocodile, Viral Video, Cro-TeluguStop.com

ఏ మాత్రం ఛాన్స్ దొరికినా స‌రే ప్రాణాలు తీసేస్తాయి.అవి మ‌న‌కంటే చాలా చురుగ్గా క‌దులుతుంటాయి.

ఏమ‌ర పాటుగా ఉన్నామంటే వాటికి ఆహారం అయిపోతాం.ఇలా క్రూర మృగాల‌తో పెట్టుకుని గాయ‌ప‌డ్డ వారు చాలామంది ఉన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో చాలానే వైర‌ల్ అవుతుంటాయి.కాగా ఈ వీడియోలు చూసిన త‌ర్వాత అయినా కొంద‌రు మార‌డం లేదు.

అదే చివ‌ర‌కు ఇబ్బందుల్లో ప‌డేస్తోంది.

ఇక నీటిలో ఉండే మొసలికి ఎంత బ‌లం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే అది బ‌య‌ట ఉన్న‌ప్పుడు చాలామంది దానితో ఫొటోలు దిగేందుకు చూస్తుంటారు.ఇలా ప‌రాచ‌కాలు ఆడి చిర‌వ‌కు దానికే ఆహారంగా మారిపోతుంటారు.

ఇక మొన్న‌టికి మొన్న ఇలాగే ఓ వ్య‌క్తి మొస‌లితో ఆట‌లాడాల‌నుకున్నాడు.కానీ తృటితో దాని నుంచి త‌ప్పించుకున్నాడు.

ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి  ఇలాగే చేశాడు.ఓ చెరువు గ‌ట్టున సేద తీరుతున్న మొస‌లి వ‌ద్ద‌కు వ‌చ్చిన టూరిస్ట్ దానితో ప‌రాచ‌కాలు ఆడాడు.

అంతే దానికి చిరాకు వ‌చ్చింది.

మొద‌ట కొంచెం బ‌య‌పెట్టేసింది.అయినా స‌రే అత‌ను మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు.మ‌రోసారి అలాగే చేశాడు.

ఇక కోపం వ‌చ్చిన ఆ మొస‌లి అత‌ని చేతిని నోట క‌రుచుకుంది.మొస‌లి నోట క‌రిచిందంటే చేయి విర‌గాల్సిందే త‌ప్ప మ‌రో మార్గం లేదు.

అయితే అత‌ను మాత్రం ఆ మొస‌లిని ఎటూ క‌ద‌ల‌నివ్వ‌కుండా దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు.దీంతో ఆ మొస‌లికి ఏం చేయాలో అర్థం కాక అత‌ని చేయిని వ‌దిలించుకుని దూరం జ‌రిగింది.

దీంతో ఆ మొస‌లి నుంచి దూరంగా ప‌రుగెత్తాడు ఆ వ్య‌క్తి  కొంచెం ఉంటే చేయి విరిగిపోయేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube