కమలా హారీస్‌కు చైనాలో మరో పేరు: 20 ఏళ్ల నాటి కథ, ఇప్పుడు వైరల్..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, కమలా హారీస్‌లను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు, ప్రముఖులు అభినందిస్తున్నారు.గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా అంతా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బైడెన్, కమలా హ్యాష్‌ట్యాగ్‌లతో నిండిపోయింది.

 He Jinli – The Chinese Name Of Kamala Harris, Goes Viral, Hee Jin Lee , Kamala-TeluguStop.com

బైడెన్ కంటే ఎక్కువగా మహిళా లోకం కమలా హారీస్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది.ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలైన తొలి మహిళగా, తొలి నల్లజాతి, తొలి ఆసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

కమలా హారిస్ తల్లి భారత్‌లోని తమిళనాడుకు చెందిన వారు కావడంతో ఆమె విజయం పట్ల భారతీయులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.కమలా హారిస్‌ను చైనాలో మరో పేరుతో పిలుస్తారట.

కమలా హారిస్‌నే కాదు, విదేశీ నేతలందరికీ ఆ దేశం ప్రత్యేక పేర్లు పెట్టుకొని స్థానిక వ్యవహారాల్లో అ పేర్లతోనే సంబోధిస్తారట.ఆ పేర్లు మాండ‌రిన్ భాష‌లో ఉంటాయి.

ఇక కమలా హారీస్ విషయానికి వస్తే.చైనాలో ఆమెను ‘హీ జిన్ లీ’ అని పిలుస్తారట.ఇక అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్‌ను ఇదే మాండరీన్ భాషలో ‘బాయి డెంగ్’ అని పిలుస్తారట.అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే అక్కడి పత్రిక ఒకటి ఈ అంశంపై కథనం ప్రచురించింది.

అయితే ‘‘ హీ జిన్ లీ ’’ అనే పేరును పెట్టింది చైనీయులు కాదు.స్వయంగా కమలా హారీసే ఆ పేరును పెట్టుకున్నారట.

20 ఏళ్ల కిందట 2000 సంవ‌త్సరంలో శాన్‌ఫ్రాన్సిస్‌కో జిల్లా అటార్నీ జ‌న‌ర‌ల్‌గా బరిలో నిలిచినప్పుడు కమలా హారీస్ తన పేరును చైనీస్ బాషలో రిజిస్టర్ చేసుకున్నారు.తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె చైనా మీడియా కంట్లో పడటానికి అలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.కమల హారిస్‌కు ఆ పేరు పెట్టింది కూడా చైనా మూలాలున్న ఆమె స్నేహితురాలే.

క‌మ‌లా హారిస్.చైనీస్ ఫ్రెండ్ తండ్రి ఆ పేరును పెట్టారట.

చైనా భాష ప్రకారం క‌మ‌లా హారిస్ పేరుకు ‘అద్భుత‌మైన అందం’ అనే అర్థం వ‌స్తుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube