ఆ చంద్ర'బాబు' దొరికేసాడోచ్ ! ఆ 'లక్ష' ఆయనకే  

He Is The One Who Got The Likeness Of Chandrababu-

ఇటీవల అచ్చం నారా చంద్రబాబు నాయుడును పోలిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో హంగామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో వర్మ దృష్టికి రావటంతో వెంటనే ఆ వ్యక్తి వివరాలు చెప్పిన వారికి లక్ష రివార్డ్ ఇస్తానని ప్రకటించేశాడు వర్మ. అంతేకాదు తాను తీయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో అతనికి అవకాశం ఇస్తానని తెలిపారు.

He Is The One Who Got Likeness Of Chandrababu-

He Is The One Who Got The Likeness Of Chandrababu

అయితే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలు రోహిత్ అనే వ్యక్తి తెలిపాడంటూ తాజాగా ట్వీట్ చేశాడు వర్మ. ”హే రోహిత్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ యూనిట్‌కి చంద్రబాబు నాయుడిని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో నీ పేరును తెరపై వేసి కృతజ్ఞతను చాటుకుంటా. ఇక నీ బ్యాంక్ ఖాతా వివరాలు పంపించు. లక్ష రూపాయల రివార్డ్ అందజేస్తా” అని తెలిపాడు వర్మ. అయితే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకి వెల్లడించలేదు.