బిగ్ బాస్ ఓటీటీలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ అతనేనా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని మరొక రోజుతో పదవ వారాన్ని కూడా పూర్తి చేసుకోనుంది.

 He Is The Lowest Remuneration Contestant In Bigg Boss Ott , Bigg Boss , Ott , Co-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమం చివరి దశకు రావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు మంచి పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన వారందరితో పోలిస్తే కంటెస్టెంట్ అనిల్ కు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. అనిల్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం పాటు కొనసాగేలేరని చాలా మంది భావించారు.

అయితే ఈయన ఎంతో కామ్ గా చాలా తెలివిగా బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లను ఆడుతూ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ వచ్చారు.ఇకపోతే అనిల్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసినందుకు ఈయనకు అత్యంత తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.

Telugu Anil Rathod, Anil, Baba Bhaskar, Bigg Boss, Contestant, Nataraj Master, T

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్ తో పోలిస్తే అనిల్ ఒక్కో వారానికి కేవలం లక్ష రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అనిల్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ అని చెప్పాలి.అయితే అనిల్ 10 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగారు.ఈయనకి కూడా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్నందుకు మంచి లాభమే ఉంటుందని చెప్పవచ్చు.

ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్ మినహా మిగిలిన కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.మరి ఈ వారం బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube