యంగ్ హీరోలలో అతనంటే చాలా ఇష్టం: ముచ్చర్ల అరుణ

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన వారిలో ముచ్చెర్ల అరుణ ఒకరు.గతంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 He Is The Fevarete Young Heroes To The Muchcharla Aruna , Muchcharla Aruna, Toll-TeluguStop.com

ఇకపోతే వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అరుణ తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భర్త మోహన్ తో కలిసి పాల్గొన్నారు.ఇప్పటివరకు అరుణ తన భర్త మోహన్ గురించి ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు.అయితే మొదటిసారిగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరుణ భర్త మోహన్ తన వ్యాపారాలు గురించి వెల్లడించారు.ఇకపోతే మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటూ అరుణ భర్తని ప్రశ్నించగా తనకు చిరంజీవి గారు తన ఫేవరెట్ హీరో అని తెలిపారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Fevarete, Mohan, Telugu, Tollywood-Movie

ఈ క్రమంలోనే ప్రస్తుత జనరేషన్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటూ అరుణని ప్రశ్నించగా తనకు ఇష్టమైన హీరో ఎవరో ఈ సందర్భంగా బయటపెట్టారు.ప్రస్తుత జనరేషన్ లో ఉన్న హీరోలలో తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని, పుష్ప సినిమాలో తన నటన ఎంతో అద్భుతంగా ఉందని వెల్లడించారు.అదేవిధంగా RRR సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ పై ఈమె ప్రశంసలు కురిపించారు.తనకు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని ఈ సందర్భంగా అరుణ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube