అతను బయట యాంకర్.. హౌస్ లో కాదు.. మా అమ్మ వార్నింగ్ ఇస్తే తప్ప కుదరదు: మానస్

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ బాగా రచ్చ రచ్చ తో సాగుతుంది.ఇక ప్రేక్షకులు కూడా ఈ రియాలిటీ షోను అస్సలు మిస్ అవడం లేదు.

 He Is The Anchor Outside Not In The House Manas Mom Warning-TeluguStop.com

రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని బాగా సందడి చేస్తున్నారు.

ఈ షో ప్రారంభమై ఐదు రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే గొడవలు కూడా జరుగుతున్నాయి.అంతేకాదండోయ్ కొన్ని కాంట్రవర్సీలు కూడా బాగానే ఎదురవుతున్నాయి.

 He Is The Anchor Outside Not In The House Manas Mom Warning-అతను బయట యాంకర్.. హౌస్ లో కాదు.. మా అమ్మ వార్నింగ్ ఇస్తే తప్ప కుదరదు: మానస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదంతా పక్కన పెడితే మరో కంటెస్టెంట్ మానస్ కాస్త వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

బుల్లితెర నటుడు మానస్ పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈ సీజన్ ఫైవ్ లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులతో మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.చూడటానికి కాస్త సైలెంట్ గా కనిపించిన కూడా గేమ్ మాత్రం బాగా ఆడుతున్నాడు.

అందరితో మాట్లాడుతున్నంతవరకు బాగానే మాట్లాడుతున్నాడు.అయితే మొన్నటి ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ ప్రియాంక అందరిని అన్నయ్య అని పిలిచి మానస్ ను ఏమని పిలుస్తావ్ అని రవి అడిగిన వెంటనే తను కాస్త నవ్వుతూ కనిపించడంతో రవి వారిద్దరికీ లింకు పెట్టేశాడు.

ఇక ఈ విషయాన్ని మరింత సాగదీశాడు రవి.

Telugu Ancher Ravi, Anchr Ravi, Bigg Boss 5, Bigg Boss Controversies, Bigg Boss Season Five, Lobo, Manas, Mother, Priyanka, Serial Actress Manas-Movie

లోబో ప్రియాంకగా, రవి మానస్ గా కాసేపు ఓ డ్రామా చేశారు.అందులో మానస్.ప్రియాంక మధ్య చూపులు ఇలా జరగాయంటూ చూపించగా.

అలా చూపించినందుకు మానస్ కాస్త ఫీల్ అయినట్లు కనిపించాడు.ఈ విషయాన్ని కాజల్ తో చెబుతూ.

రవి ఇలా సాగదీయడం కరెక్టు కాదు అంటూ.అతను బయట యాంకర్ కానీ ఆయన చేస్తున్న షో కాదు, ఈవెంట్ కాదు.

ఈ విషయాన్ని గురించి మా అమ్మ వార్నింగ్ ఇస్తే తప్ప కుదరదు అంటూ కాస్త ఫైర్ అయినట్లు కనిపించాడు.ఇక ప్రియాంక చాలా మంచి అమ్మాయని.

ఆమె అంటే ఆరాధనాభావం అంటూ అంతే కాని ఎటువంటి ఉద్దేశం లేదు అని తెలిపాడు మానస్.

#Priyanka #Manas #Anchr Ravi #Bigg Boss #Actress Manas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు