ఆయ‌న ఎఫెక్ట్‌... పురందేశ్వ‌రి పాలిటిక్స్‌కు ఎండ్ కార్డ్‌....!

రాజ‌కీయాల్లో నేత‌ల త‌ల‌రాత‌లు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేం.నిన్న‌టి రాజే నేడు బంటుగా మారిన ప‌రిస్థితి క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

 He Is Perfect.. Purandheswari End Card For Politics, Purandeshwari, Ntr, Somu Ve-TeluguStop.com

ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.పేరెన్నిక‌గ‌న్న‌.

పొలిటిక‌ల్ నాయ‌కురాలు.అన్న‌గారు ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విష‌యంలోనూ చోటు చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్‌లోకి అడుగు పెట్టి.సంచ‌ల‌నం సృష్టించిన పురందేశ్వ‌రి.2004లో బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగావిజ‌యం సాధించారు.ఆ త‌ర్వాత 2009లో విశాఖ ఎంపీగా గెలిచి.

కేంద్రంలో మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకుని చ‌క్రం తిప్పారు.

కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు నెరిపిన నాయ‌కురాలిగా కూడా పురందేశ్వ‌రి గుర్తింపు సాధించారు.

అయితే, రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్‌తో విభేదించిన ఆమె.ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.2014లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇక‌, అప్ప‌టి నుంచి పురందేశ్వ‌రి.రాజ‌కీయం.జారుడు బండ‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.2014 ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పోటీ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.అక్క‌డ ఓడిపోతాన‌ని తెలిసినా.

త‌ప్పని ప‌రిస్థితిలో అప్ప‌టి రాజ‌కీయ కార‌ణాల నేప‌థ్యంలో ఆమె పోటీ దిగి.అనుకున్న‌ట్టుగానే ఓడిపోయారు.

అయిన‌ప్ప‌టికీ.బీజేపీలో యాక్టివ్ రోల్ పోషించారు.

కేంద్రంలో ఏదో ఒక నామినేటెడ్ ప‌దవి ద‌క్క‌క పోతుందా? అనుకున్నారు.

Telugu Chance, Purandeshwari, Purandheswari, Rajampeta, Somu Veera Raju-Telugu P

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి విశాఖ నుంచి పోటీ చేసినా.ఓట‌మి పాల‌వ‌క‌త‌ప్ప‌లేదు.ఆ త‌ర్వాత కూడా కేంద్రంలోని నేత‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.

రాజ్య‌స‌భ రేసులో త‌న పేరు వ‌చ్చేలాప్ర‌య‌త్నించారు.అయితే, ఆమెకు రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌తో అంత స‌ఖ్య‌త లేద‌నే టాక్ ఉంది.

పైగా ఆర్ ఎస్ ఎస్ మూలాలు న్న సోము వీర్రాజు వంటి నాయ‌కుల‌తో ఆమెకు ఎడ‌మొహం పెడ‌మొహం అనే మాట కూడా ఉంది.అయిన‌ప్ప‌టికీ.

క‌న్నా లక్ష్మీనారాయ‌ణ బీజేపీ సార‌థిగా ఉన్నంత‌వ‌ర‌కు పురందేశ్వ‌రి ఒకింత నెట్టుకొచ్చారు.ఇక‌, సోముకు ఇటీవ‌ల ప‌గ్గాలు చేతికి వ‌చ్చాక‌.

సైలెంట్ అయిపోయారు.

అప్ప‌టి నుంచి పార్టీలోనూ.

మీడియా ముందు కూడా పురందేశ్వ‌రి మాట్లాడ‌డం, క‌నిపించ‌డం మానేశారు.అప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్‌పైనా.

అమ‌రావ‌తిని త‌ర‌లించ‌డంపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన పురందేశ్వ‌రి.హ‌ఠాత్తుగా మౌనం పాటించారు.

దీనికితోడు సోము వీర్రాజు తాజాగా ప్ర‌క‌టించిన త‌న క‌మిటీ జాబితాలో పురందేశ్వ‌రికి ఎక్క‌డా చోటు ల‌భించ‌లేదు.ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానో.

లేక ఉపాధ్య‌క్షురాలిగానో కూడా ఆమెకు సోము చోటు ఇవ్వ‌లేదు.దీంతో మ‌రింత‌గా పురందేశ్వ‌రి కుంగిపోయార‌ని అంటున్నారు.

మొ్త్తంగా సోము ఎఫెక్ట్‌తో ఆమె బీజేపీకి దూర‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube