అతడూ మనిషే కోతి కాదు.. కాకపోతే అలా ఎందుకంటే..?!

ఓ వ్యక్తి చూడడానికి అచ్చం కోతి రూపంలో ఉండడంతో ఆ యువకుడు దాంతో బయట తిరగడానికి వీలులేకుండా పోయింది.ఆ పిల్లాడిని చూసి ఊర్లో జనాలు కోతి అని పిలవడంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు అబ్బాయిని స్కూల్ కు పంపించడం కూడా మానిపించి ఇంట్లోనే ఉంచేశారు.

 He Is Not A Human Monkey Either If Not Because ,  Human ,monkey , Because, Mowgl-TeluguStop.com

అయితే ఈ విషయం కాస్త లేటుగా సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టిలో కోతి మొఖం ఉన్న వ్యక్తిగా కాకుండా రియల్ మోగ్లీగా పేరు తెచ్చుకుంటున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తూర్పు ఆఫ్రికాలో ఉన్న రువాండాలో 1999 లో జన్మించిన ఎల్లీ అనే యువకుడిని ఇప్పుడంతా రియల్ లైఫ్ మోగ్లీ అని పిలుస్తున్నారు.అయితే, మామూలుగా మనిషికి ఉండే తల సైజు కంటే అతని తల సైజు చాలా చిన్నగా ఉంటుంది.

మైక్రోసెఫాలీ’ (Microcephaly) అనే వ్యాధి కారణంగా అతని తల మామూలు సైజు కంటే చిన్నగా ఉండి జన్మించాడు.దీంతో అతడు అందరి మనుషుల్లాగా కాకుండా కాస్త వింతగా జన్మించాడు.

అంతేకాదు ఆ పిల్లాడు అందరిలాగా జీవించలేక పోతున్నాడు.

అతడి ఊర్లోని ప్రజలంతా ఆ పిల్లాడిని కోతి అంటూ ఏడిపించడం మొదలు పెట్టారు.

కేవలం ముఖం మాత్రమే కాకుండా అతడికి వినికిడి లోపం, మాటలు రాకపోవడం లాంటి ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తిని స్కూల్ కు పంపించడం కూడా తల్లిదండ్రులు మానిపించారు.అయితే ఆ అబ్బాయి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడిలో ఓ ప్రత్యేకత దాగి ఉంది.

అదేంటంటే.అతడు అడవుల్లో ఏకధాటిగా 30 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు ట్రెక్కింగ్ చేయగలడు.

కాబట్టే, ఎల్లీనీ ఇప్పుడు అందరూ రియల్ లైఫ్ మోగ్లీ అంటూ సంబోధిస్తున్నారు.అయితే అతని దయనీయ పరిస్థితిని గమనించిన ఓ మీడియా సంస్థ “గో ఫండ్ మీ ” అనే పేజ్ ద్వారా అతని వైద్య సేవల కోసం నిధులను సేకరిస్తుంది.

దీంతో ఇప్పటివరకు ఆ రియల్ మోగ్లీకి మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం విరాళంగా వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube