ఈయన డాక్టర్ కాదు దేవుడు..! నొప్పితో బాధపడుతూనే ఇతరులకు వైద్యం..

మనం పూజించే దేవుడి మనకు నొప్పి కలిగినపుడు నయం చేస్తాడో లేదో తెలియదు కానీ, వైద్యుడు మాత్రం మన నొప్పిని నయం చేస్తాడు.ఈ క్రమంలోనే దేవుడితో సమానమైన రూపం డాక్టర్ అని కొందరు చెప్తుంటారు.

 He Is Not A Doctor God Healing For Others While Suffering From Pain-TeluguStop.com

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రజలను కాపాడేందుకు వైద్యులు, నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయం.ఈ నేపథ్యంలో నొప్పితో బాధపడుతున్న ఓ వైద్యుడు తన నొప్పిని భరిస్తూనే ఇతర పేషెంట్లకు నయం చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇంతకీ అసలు ఏ జరిగింది? సదరు డాక్టర్ ఏ ప్రాంతం వాడు తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

 He Is Not A Doctor God Healing For Others While Suffering From Pain-ఈయన డాక్టర్ కాదు దేవుడు.. నొప్పితో బాధపడుతూనే ఇతరులకు వైద్యం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వీఆర్‌పురం మండలం రేఖపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో వైద్యుడిగా పని చేస్తున్న సుందర్ ప్రసాద్‌కు స్థానికంగా మంచి పేరుంది.ఇటీవల ఆయన హెల్త్ సరిగా లేకపోవడంతో మందులు తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తను పని చేసే ఆస్పత్రిలోనే సిబ్బంది సాయంతో సెలైన్ ఎక్కించుకున్నాడు.అయితే, అప్పటికే జనాలు క్యూ కట్టారు.

తమ హెల్త్ ఇష్యూస్ చెప్పుకునేందుకు గాను డాక్టర్ వద్దకు వచ్చారు.ఆ జనాలను చూసి మానవత్వంతో స్పందించాడు డాక్టర్ సుందర్ ప్రసాద్.

ఓ చేత్తో సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూనే మరో చేత్తో రోగులకు చికిత్స చేశాడు.పేషెంట్స్‌ను వారి ప్రాబ్లమ్స్ అడుగుతూ మందులు రాసిచ్చాడు.

ఈ క్రమంలోనే ఎవరో ఓ వ్యక్తి డాక్టర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వారి పట్ల పూర్తి నెగెటివిటీ ఉన్న ఈ సందర్భంలో డాక్టర్ చేసిన పని చూసి నెటిజనాలు మెచ్చుకుంటున్నారు.

వైద్యుడికి హ్యాట్సాప్ చెప్తున్నారు.ఆ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని కామెంట్స్ చేస్తున్నారు.

#He Feels Pain #GoodHelping #Social Media #Doctor #Treatment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు