ఈ వ్యక్తితో అమలాపాల్ ప్రేమలో ఉందంటూ ప్రచారం.. ఆమె ఏమందంటే..?

తెలుగులో చరణ్, అల్లు అర్జున్ లతో కలిసి నటించిన అమలా పాల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు.ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్ మైనా అనే సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

 He Is My Brother Not Lover Says Amala Paul-TeluguStop.com

ఆ సినిమా తరువాత దైవతిరుమగన్‌ సినిమాతో పాటు పలు సినిమాలలో అమలాపాల్ నటించారు.

ఒక సినిమా షూటింగ్ సమయంలో అమలాపాల్, ఏఎల్ విజయ్ ప్రేమలో పడ్డారు.2014 సంవత్సరంలో అమలాపాల్, ఏఎల్ విజయ్ వివాహం జరిగింది.అయితే పెళ్లి తరువాత అమలాపాల్ కు, ఏఎల్ విజయ్ కు మధ్య గొడవలు వచ్చాయి.2017 సంవత్సరంలో అమలాపాల్, విజయ్ విడిపోయారు.విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ గ్లామర్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు.

 He Is My Brother Not Lover Says Amala Paul-ఈ వ్యక్తితో అమలాపాల్ ప్రేమలో ఉందంటూ ప్రచారం.. ఆమె ఏమందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆడై అనే మూవీ కొరకు అమలాపాల్ 14 రోజులు నగ్నంగా నటించడం గమనార్హం.

అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందని కొన్ని వార్తలు వైరల్ అయినా అమలా పాల్ మాత్రం ఆ వార్తల గురించి రియాక్ట్ కాలేదు.తాజాగా అమలాపాల్ ఒక వ్యక్తి తొడపై కూర్చుని ఫోటో దిగగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది.దీంతో అమలాపాల్ ఫోటోలోని వ్యక్తితో ప్రేమలో ఉందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

అయితే వైరల్ అయిన వార్తలపై అమలాపాల్ స్పందించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన సోదరుడని అమలాపాల్ పేర్కొన్నారు.పోస్ట్ లో కూడా ఆ వ్యక్తి సోదరుడని అమలా పాల్ పేర్కొన్నా ఎవరూ నమ్మకపోవడంతో అమలాపాల్ స్పందించి ఘాటుగా బదులిచ్చారు.తెలుగులో అమలాపాల్ కు పెద్దగా ఆఫర్లు లేకపోయినా తమిళంలో మాత్రం అమలాపాల్ కు అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయి.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.

#Amala Paul #Not Lover

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు